నవంబర్ పదో తేదీ వెలువడిన బీహార్ ఎన్నికల్లో గెలుపొందిన ఎంఐఎం ఐదుగురు ఎమ్మెల్యేలు భాగ్యనగరం చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో స్థానిక ఎంఐఎం ప్రజాప్రతినిధులు వారికి ఘన స్వాగతం పలికారు.
బీహార్‌లోని అమౌర్, కొచాధమన్, జోకిహాట్, బైసీ, బహదూర్‌గంజ్ నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందారు. వీరంతా హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీని కలువనున్నారు.