ETV Bharat / state

సీఎం బయటకు వస్తే జనం భయంతో వణికిపోవాలా?: బండి సంజయ్ - బండి సంజయ్ ఆగ్రహం

Bandi Sanjay Fires on KCR: ముఖ్యమంత్రి బయటకు వస్తే జనం భయంతో వణికిపోవాలా? అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. జనగామ జిల్లాకు చెందిన భాజపా కార్యకర్తలను అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Bandi Sanjay Fires on KCR, bjp leaders arrest
సీఎం బయటకు వస్తే జనం భయంతో వణికిపోవాలా? : బండి సంజయ్
author img

By

Published : Feb 11, 2022, 12:34 PM IST

Bandi Sanjay Fires on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ పర్యటన నేపథ్యంలో భాజపా నాయకులు, కార్యకర్తలను గృహ నిర్భంధం చేయడం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి బయటకు వస్తే జనం భయంతో వణికిపోవాలా? అని ప్రశ్నించారు. జనగామ జిల్లాకు చెందిన భాజపా నాయకులు, కార్యకర్తలను గత రెండు రోజులుగా అరెస్టు చేసి.. పోలీస్ స్టేషన్​లో నిర్బంధించి నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. వాళ్లేమైనా ఉగ్రవాదులా? నిషేధిత సంస్థ సభ్యులా అని ప్రశ్నించారు.

'భయపడే ప్రసక్తే లేదు'

గతంలో ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి వస్తున్నారంటే... జనం సంతోషంగా ఉండేవాళ్లని తెలిపారు. ప్రజలు వినతి పత్రాలతో సీఎంను కలిసేందుకు సిద్ధంగా ఉండేవాళ్లన్నారు. కానీ సీఎం కేసీఆర్ వస్తుంటే జనం భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొందని బండి ఆరోపించారు. ఎంతమందిని అరెస్టు చేసినా... మరెన్ని దాడులు చేసినా భాజపా కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదన్నారు.

'తక్షణమే విడుదల చేయాలి'

సీఎంకు భాజపా కార్యకర్తలంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. అరెస్టు చేసిన కార్యకర్తలందరిని బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

ఇదీ చదవండి: CM KCR JANGAON TOUR: నేడు జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.