ETV Bharat / state

బైరామల్​గూడ పైవంతెనను ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గించేందుకు నిర్మిస్తోన్న పైవంతెనలు, అండర్‌పాస్‌లు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న మహనగరాన్ని ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ నగరంగా మార్చేందుకు ఎస్​ఆర్​డీపీ కింద ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు, రోడ్డు విస్తరణ ప‌నుల‌ను చేపట్టారు. తాజాగా సాగర్‌రింగు రోడ్డులోని బైరామల్‌గూడ చౌరస్తా వద్ద పైవంతెనను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్​తో కలిసి ప్రారంభించారు.

బైరామల్​గూడ పైవంతెనను ప్రారంభించిన కేటీఆర్
బైరామల్​గూడ పైవంతెనను ప్రారంభించిన కేటీఆర్
author img

By

Published : Aug 10, 2020, 11:40 AM IST

Updated : Aug 10, 2020, 12:40 PM IST

హైదరాబాద్‌ మహానగరంలో రోజురోజుకూ ట్రాఫిక్‌ భారీగా పెరిగిపోతోంది. రోడ్లపై రద్దీతో వాహనాదారులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఈ పరిస్థితుల్లో ట్రాఫిక్‌ చిక్కులు తీర్చేందుకు ప్రభుత్వం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించింది. ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాసులను నిర్మిస్తోంది. ఇప్పటికే పలు పైవంతెనలు, అండర్ పాస్‌లు అందుబాటులోకి రాగా... తాజాగా బైరామల్‌గూడ చౌరస్తాలో ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్​తో కలిసి ప్రారంభించారు. ఎస్​ఆర్డీపీ ప్యాకేజీ-2లో భాగంగా 26.45 కోట్ల అంచ‌నా వ్యయంతో కుడివైపు ఫ్లైఓవ‌ర్ నిర్మించారు.

బైరామ‌ల్ గూడ జంక్షన్‌లో నిర్మించిన కుడివైపు ఫ్లైఓవ‌ర్ నిర్మాణంలో ప్రత్యేక సాంకేతికతను వినియోగించారు. ఈ పైవంతెనతో బైరామ‌ల్ గూడ జంక్షన్‌, సాగ‌ర్‌రోడ్ జంక్షన్‌పై ఒత్తిడి త‌గ్గనుంది. బైరామ‌ల్‌గూడ జంక్షన్‌లో ర‌ద్దీ వేళ‌ల్లో గంట‌కు దాదాపు 12 వేల వాహ‌నాలు ప్రయాణిస్తాయి. సికింద్రాబాద్ నుంచి ఓవైసి జంక్షన్‌కు, శ్రీ‌శైలం వెళ్లే వాహ‌న‌దారుల‌కు కూడా ఈ ఫ్లైఓవ‌ర్ ఉపయోగపడనుంది.

ప్రభుత్వం ఎస్​ఆర్డీపీ కింద చేప‌ట్టిన 14 ప్యాకేజీల ప‌నుల‌లో ఆరు పూర్తయ్యాయి. ఇందులో ప్యాకేజీ-2లో భాగంగా రూ. 448 కోట్ల అంచ‌నా వ్యయంతో ఎల్బీనగర్‌ చౌరస్తా, బైరమాల్‌గూడ, నాగోల్‌ కామినేని చౌరస్తా, చింతల్‌కుంట వద్ద పైవంతెనలు, అండర్‌పాసుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో ఇప్పటివరకు ఇప్పటి వ‌ర‌కు ఎల్బీన‌గ‌ర్ జంక్షన్‌లో దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి హయత్‌నగర్‌ వైపు వెళ్లేందుకు ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. కామినేని జంక్షన్‌లో కుడి, ఎడమ ఫ్లైఓవర్లు ప్రారంభమయ్యాయి. ఎల్బీనగర్‌, చింతల్‌కుంట అండర్‌పాసులపైన వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పుడు బైరామల్‌గూడా చౌరస్తాలో పైవంతెన ప్రారంభమైంది. ఇదే జంక్షన్‌లో మిగిలిన పనులు కూడా అధికారులు త్వరితగతిన కొనసాగిస్తున్నారు.

Last Updated : Aug 10, 2020, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.