ETV Bharat / state

అన్నదానం చేస్తున్న సంస్థకు 3 కోట్ల సాయం

లాక్​డౌన్ పరిస్థితుల్లో పేదలకు ఆహార వితరణ కల్పిస్తున్న అక్షయపాత్ర హరేకృష్ణ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌కు ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో కంపెనీ ఉద్యోగులు ఒక రోజు వేతనం రూ. 3 కోట్ల విరాళం అందించారు.

author img

By

Published : May 12, 2020, 3:40 PM IST

aurobindo pharma 3 crore assistance to the charity at hare krishna charitable trust
అన్నదానం చేస్తున్న సంస్థకు 3 కోట్ల సాయం

హైదరాబాద్ హైటెక్‌ సిటీలో అరబిందో కంపెనీ ఉద్యోగులు ఒక రోజు వేతనం రూ. 3 కోట్లను అక్షయపాత్ర హరేకృష్ణ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌కు సాయం చేశారు. ఆ ఫౌండేషన్‌ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభుకు అరబిందో సంస్థ వైస్‌ ఛైర్మన్‌ నిత్యానందరెడ్డి, బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ శరత్‌ చంద్రరెడ్డి చెక్కును అందజేశారు.

కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు ప్రతి రోజు ఆహారం అందిస్తున్న హరేకృష్ణ అందించినట్లు కంపెనీ హెచ్‌ఆర్‌ యుఎన్‌బి. రాజు తెలిపారు. సంస్థలో దాదాపు 19 వేల మంది పని చేస్తున్నారని, వారందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఒక రోజు వేతనం అందించినట్లు ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో పేదలకు ప్రతి రోజు అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఆహారం అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రతి రోజూ ఒక లక్షా 85 వేల మందికి ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు.

అన్నదానం చేస్తున్న సంస్థకు 3 కోట్ల సాయం

ఇదీ చూడండి : దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం... చూపరులకు కనువిందు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.