ETV Bharat / state

నేడు రాష్ట్రానికి అమిత్​ షా - పలు బహిరంగ సభల్లో ప్రచారం

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2023, 5:59 AM IST

Amit Shah Telangana Tour Today : కేంద్రమంత్రి అమిత్​ షా నేడు రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం నగరానికి చేరుకోనున్న ఆయన.. రాష్ట్రంలో బిజీబిజీగా గడపనున్నారు. పలు బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారం నిర్వహించనున్నారు. సభల అనంతరం రాత్రికి తిరిగి దిల్లీ వెళ్లనున్నారు.

Amit Shah Telangana Tour Schedule Today
Amit Shah

Amit Shah Telangana Tour Schedule Today : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు రాష్ట్రానికి రానున్నారు. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా 12:05కి హెలికాప్టర్​లో గద్వాల్ ప్రయాణం అవుతారు. గద్వాల్‌లో బీజేపీ నిర్వహించే సకల జనుల విజయ సంకల్ప సభ(Vijaya Sankalpa Sabha)కు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఒంటి గంట నుంచి 1: 35 వరకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. గద్వాల్ సభ అనంతరం అమిత్‌ షా.. నల్గొండకు బయల్దేరి వెళ్లనున్నారు. 2:55 నుంచి 3: 30 గంటల వరకు నల్గొండ, సాయంత్రం 4:25 నుంచి 5:05 వరకు వరంగల్​లో నిర్వహించే సభల్లో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

వరంగల్ సభ ముగించుకుని అమిత్ షా హైదరాబాద్​కు చేరుకుంటారు. 6:10 నుంచి 6:40 గంటల వరకు కట్రీయా హోటల్​లో బీజేపీ మేనిఫెస్టో(Telangana BJP Manifesto)ను విడుదల చేస్తారు. ఎన్నికల ప్రణాళిక విడుదల అనంతరం.. సికింద్రాబాద్‌ క్లాసిక్‌ గార్డెన్‌లో 6:45 నుంచి 7:45 వరకు ఎమ్ఆర్పీఎస్ నేతలతో సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం.. రాత్రి 8:00 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్​కు తిరుగు ప్రయాణం కానున్నారు.

Amit Shah Speech At Suryapet Jana Garjana Sabha : 'వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్ష్యం'

BJP Election Campaign in Telangana 2023 : రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో.. రాష్ట్రంలో వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల పర్యటనలతో ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో పట్టు సాధించలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే ఎన్నికల సభలలో పాల్గొన్నప్పటికీ మరోమారు ఎన్నికల ప్రచార సభలలో పాల్గొననున్నారు. ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో జరిగే భారతీయ జనతా పార్టీ సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొంటారు. ఇప్పటికే స్థానిక నాయకులు దగ్గరుండి సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అమిత్ షా సభ స్థలానికి చేరుకొని సభను ఉద్దేశించి మాట్లాడనున్నాట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాదగాని శ్రీనివాస్​ గౌడ్ తెలిపారు.

23 తర్వాత అగ్రనేతల విస్తృత ప్రచారం..: ఇదిలా ఉండగా.. ఈ నెల 23 తర్వాత తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారం ఈ నెల 23తో ముగుస్తుండటంతో.. పూర్తిగతా తెలంగాణపై ఫోకస్ పెట్టనున్నారు. ఐదు రోజుల్లో 50 సభలకు ప్లాన్ చేస్తున్నారు. ప్రచారానికి ప్రధాని, అమిత్ షా, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ, ఏక్​నాథ్ షిండే, కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు రానున్నారు.

ఏడు ప్రధాన అంశాలతో బీజేపీ ఇంద్రధనస్సు మేనిఫెస్టో - వారి సంక్షేమంపైనే స్పెషల్ ఫోకస్

Telangana BJP professionals and intellectuals Meet : 'బీజేపీ.. సిద్ధాంతాల పార్టీ.. బీఆర్​ఎస్​కు ఏం విధానం ఉంది?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.