3 Crore Worth of Ganja Seized by Police : మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న రెండు గ్యాంగులను సైబరాబాద్ పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. మహారాష్ట్ర, హర్యానాకు చెందిన ఈ రెండు ముఠాలు వేర్వేరుగా తరలిస్తున్న మూడు కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 1228 కిలోల గంజాయి(Marijuana Case)ని స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
రెండు కేసుల్లో ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక పిస్టల్, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పట్టుబడ్డ నిందితులపై గతంలో కూడా కేసులున్నాయని సీపీ తెలిపారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి తెలంగాణ మీదుగా గంజాయి సరఫరా చేస్తున్నారని స్పష్టం చేశారు.
SI Rajendra Narcotics case in Hyderabad : గతంలో కూడా గంజాయిని పక్క రాష్ట్రం నుంచి తెలంగాణ మీదుగా వేరొక రాష్ట్రానికి గంజాయిని వివిధ వాహనాల్లో తరలించిన నిందితులను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారని వివరించారు. అనంతరం మాదక ద్రవ్యాల కేసులో అదుపులోకి తీసుకున్న ఎస్సై రాజేంద్ర(SI Rajendra) కేసు విషయాలు తెలిపారు. మాదక ద్రవ్యాల కేసులో ఎస్సై రాజేంద్రకి ఎవరెవరితో సంబంధాలున్నాయో.. తెలుసుకునే విధంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. కానిస్టేబుళ్లపై ఈ కేసుతో సంబంధం ఉందా? లేదా? అనే కోణంలో విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే రాజేంద్రని ఈ కేసు విషయంలో సస్పండ్ చేసినట్లు గుర్తు చేశారు.
A Woman Transporting Drugs Case in Hyderabad : తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు కొత్తగా ఏర్పాటు చేసిన మోకా పోలీసులు మరోసారి హైదరాాబాద్‌లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ మహిళ గోవా నుంచి డ్రగ్స్ తీసుకువస్తోందన్న పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. ఆమె ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌కి చెందిన అనురాధ(34) మత్తు పదార్థాలకు అలవాటు పడి.. తరువాత తనే స్వయంగా ఈ బిజినెస్‌లోకి దిగింది. గోవాలో డ్రగ్స్ విక్రయించే నైజీరియన్ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. భాగ్యనగరంలో పలు చోట్ల టిఫిన్ షాపులు నిర్వహిస్తున్న ప్రభాకర్‌రెడ్డితో పరిచయం పెంచుకుని.. గోవా నుంచి తెస్తున్న మత్తు పదార్థాలను అతడికి ఇచ్చేది. అతను ఆ టిఫిన్ సెంటర్లకి వచ్చే కొంత మందితో పరిచయం పెంచుకుని విక్రయించేవాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ నెల 10వ తేదీన డ్రగ్స్‌తో వస్తున్న ఆమెను పట్టుకున్నారు. పట్టుకున్న సరుకు విలువ రూ.14 లక్షలు ఉంటుంది.
Hyderabad SI Rajendra Drugs Case Update : డ్రగ్స్ కేసు అప్డేట్.. SI రాజేంద్ర కాల్‌డేటాలో అసలుగుట్టు