రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 30 వేలు దాటింది. కొత్తగా 1410 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 30,946కి చేరింది. కొవిడ్‌తో మరో ఏడుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 331కి పెరిగింది. కొత్తగా 913 మంది వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జయ్యారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 18,192కి చేరింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 12,423 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
గురువారం వచ్చిన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 918 రాగా.. రంగారెడ్డి పరిధిలో 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ 67, సంగారెడ్డి 79 కొవిడ్ కేసులొచ్చాయి.
ఇదీ చదవండి : ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ స్ఫూర్తిగా నూతన సచివాలయం