ETV Bharat / state

'జామాయిల్​కు గిట్టుబాటు ధర కల్పించండి'

author img

By

Published : Jan 28, 2021, 2:16 PM IST

జామాయిల్ కర్రకు గిట్టుబాటు ధర కోరుతూ.. బూర్గంపాడు మండలంలోని సారపాక ఐటీసీ ఎదుట, రైతులు భాజపా నేతల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

jamail-farmers-held-a-dharna-under-the-auspices-of-bjp-leaders-in-bhadradri-kottagudem
'జామాయిల్​కు గిట్టుబాటు ధర కల్పించండి'

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో.. జామాయిల్​ రైతులు భాజపా నేతల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పంటకు గిట్టుబాటు ధరను కల్పించాలని డిమాండ్​ చేస్తూ సారపాక భద్రాచలం పేపర్ లిమిటెడ్ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు.

ఐటీసీ.. జామాయిల్ కర్రకు టన్నుకు రూ. 3వేలను మాత్రమే చెల్లించి రైతులను మోసం చేస్తోందని భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. 2018లో కంపెనీ తీసుకొచ్చిన జీవో ప్రకారం.. రూ. 4500ను చెల్లించాలని ఆయన డిమాండ్​ చేశారు.

నిరసనలో భాగంగా నాయకులు, రైతులతో కలిసి గేటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ క్రమంలో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఈ ఆందోళనలో భాజపా జిల్లా అధ్యక్షులు కోనేరు నాగేశ్వరరావు, రాష్ట్ర టుబాకో బోర్డు కమిటీ సభ్యులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.