రామగుండం ఓపెన్ కాస్ట్.1లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల మృతికి పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యానిదేనని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన సంతాప సభలో.. సింగరేణి ఓబి ఆపరేటర్స్ వర్కర్స్ యూనియన్‌తో పాటు పలు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సింగరేణి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామయ్య డిమాండ్ చేశారు.
కార్మికుల డిమాండ్లు
- సింగరేణి ఓపెన్ కాస్ట్‌లు ప్రమాదాలకు నిలయాలయ్యాయని.. ప్రతి ఏటా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
- ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు కాంట్రాక్టు కార్మికులను సమిధలుగా చేయటం అన్యాయమన్నారు.
- అధిక ఉత్పత్తి, అవార్డులు, రివార్డుల కొరకు అధికారులు ఆతృత పడవద్దని కార్మిక నేతలు హెచ్చరించారు.
- రామగుండం ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఇఫ్టూ ఏరియా కార్యదర్శి సారంగపాణి, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మెట్రో టికెట్ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్