బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో 4వ స్నాతకోత్సవం కోలాహలంగా సాగింది. పలు విభాగాల్లో ఉత్తీర్ణులైన ఇంజినీరింగ్ విద్యార్థులకు కళాశాల ఉపకులపతి డాక్టర్. అశోక్ పట్టాలను అందజేశారు.పతకాలు, పట్టాలు పొందిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తమ జీవితాలకు బంగారు బాట వేసిన కళాశాల యాజమన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు ప్రొ. వెంకటరమణ పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'మా' లో రాజకీయాలు వద్దు..!