ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రైతులకు లాక్‌డౌన్ ఇబ్బందులేవీ తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర వెల్లడించారు. ఖరీఫ్ ఆరంభం కానున్న దృష్ట్యా రైతులు తమకు కావాల్సిన ఎరువులు, విత్తనాల కొనుగోళ్లు చేసుకోవచ్చని సూచించారు.
వ్యవసాయ సంబంధ దుకాణాల నిర్వహణ, సిబ్బందికి.. వ్యవసాయ శాఖ అధికారుల సిఫారసుకు అనుగుణంగా అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న ద్విచక్రవాహనాలు, కార్లను సీజ్ చేశారు. ఆదిలాబాద్, ఉట్నూర్ డివిజన్ల పరిధిలో లాక్‌డౌన్ తీరును ఆయన పరిశీలించారు.
ఇదీ చదవండి: సేవలు అందిస్తున్నా మాపై ఎందుకీ నిర్లక్ష్యం..?