ETV Bharat / sports

కరోనా దెబ్బకు 'ప్రపంచకప్​' నుంచి ఆరు దేశాలు ఔట్

author img

By

Published : Feb 27, 2020, 6:56 AM IST

Updated : Mar 2, 2020, 5:16 PM IST

వచ్చే నెలల్లో జరిగే షూటింగ్​ ప్రపంచకప్​లో పాల్గొనకుండా చైనా సహా మరో ఐదు దేశాలు వెనక్కి తగ్గాయి. ఈ విషయాన్ని ఎన్​ఆర్ఏఐ అధ్యక్షుడు రనీందర్ సింగ్ స్పష్టం చేశారు. ​

కరోనా దెబ్బకు 'ప్రపంచకప్​' నుంచి ఆరు దేశాలు ఔట్
షూటింగ్ ప్రపంచకప్​

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే వందల సంఖ్యల మరణాలు నమోదవుతుండగా, ఆ ప్రభావం వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న షూటింగ్ ప్రపంచకప్​పైనా పడింది. దిల్లీలో మార్చి 15 నుంచి 26 క్రీడల్లో పాల్గొనకుండా చైనా సహా మరో ఐదు దేశాలు వెనక్కు తగ్గాయి. ఈ విషయాన్ని జాతీయ రైఫిల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా​ అధ్యక్షుడు రనీందర్ సింగ్​ స్పష్టం చేశారు.​

Coronavirus
కరోనా వైరస్​ ప్రభావంతో ఆసుపత్రిలో చికిత్స

"ఈ టోర్నీకి కొన్ని దేశాలు రావాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావం కారణంగా వారు పాల్గొనడం లేదు. తమ దేశంలో వైరస్​ వ్యాప్తి చెందుతుండటం వల్ల స్వతహాగా చైనా ఈ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు తైవాన్, హాంగ్​కాంగ్, మకావు, ఉత్తర కొరియా, తుర్కమెనిస్థాన్ ఈ జాబితాలో ఉన్నాయి" -రనీందర్ సింగ్​, ఎన్​ఆర్​ఏఐ​ అధ్యక్షుడు

ఈనెల ప్రారంభంలో ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్​షిప్​లో బరిలోకి దిగాల్సిన కొందరు చైనా రెజ్లర్లకు, భారత ప్రభుత్వం వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ టోర్నీలో పాకిస్థాన్ షూటర్లు పాల్గొనట్లేదని చెప్పారు ఎన్​ఆర్​ఏఐ​ అధ్యక్షుడు.

Last Updated : Mar 2, 2020, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.