ETV Bharat / sports

భారత గోల్​కీపర్​ శ్రీజేష్​కు ప్రతిష్ఠాత్మక అవార్డు - Olympic hockey team India

Goalkeeper PR Sreejesh: భారత పురుషుల హాకీ జట్టు గోల్​కీపర్​ పీఆర్​ శ్రీజేష్​.. ప్రతిష్ఠాత్మక వరల్డ్​ గేమ్స్​ అథ్లెట్​ ఆఫ్​ ది ఇయర్​ అవార్డును దక్కించుకున్నాడు. భారత్​ తరఫున ఈ పురస్కారాన్ని అందుకున్న రెండో హాకీ ప్లేయర్​గా నిలిచాడు.

Goalkeeper PR Sreejesh
Goalkeeper PR Sreejesh
author img

By

Published : Jan 31, 2022, 9:15 PM IST

Goalkeeper PR Sreejesh: టోక్యో ఒలింపిక్స్​లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలవడంలో కీలకంగా వ్యవహరించిన గోల్​కీపర్​ శ్రీజేష్​కు అరుదైన గౌరవం దక్కింది.​ ప్రతిష్ఠాత్మక వరల్డ్​ గేమ్స్​ అథ్లెట్​ ఆఫ్​ ది ఇయర్​ అవార్డును దక్కించుకున్నాడు. భారత్​ తరఫున ఈ పురస్కారాన్ని అందుకున్న రెండో హాకీ ప్లేయర్​గా నిలిచాడు. అంతకుముందు మహిళల హాకీ జట్టు కెప్టెన్​ రాణి రాంపాల్​ ఈ ఘనత సాధించింది.

"ఈ అవార్డును గెలుచుకున్నందుకు చాలా గౌరవంగా భావిస్తున్నాను. నన్ను ఈ అవార్డుకు నామినేట్ చేసినందుకు ఎఫ్​ఐహెచ్​కి.. నాకు ఓటు వేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ హాకీ ప్రేమికులందరికీ ధన్యవాదాలు. నామినేట్ అవడం ద్వారా నా వంతు పని నేను చేశాను. కానీ మిగిలింది అభిమానులు, హాకీ ప్రేమికులు పూర్తి చేశారు. కాబట్టి ఈ అవార్డు వారికే దక్కుతుంది. నాకంటే వారే ఈ అవార్డుకు అర్హులని భావిస్తున్నాను. ఇది భారతీయ హాకీకి కూడా గొప్ప క్షణం. హాకీ సంఘంలోని ప్రతి ఒక్కరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని హాకీ సమాఖ్యలు నాకు ఓటు వేశాయి. కాబట్టి హాకీ కుటుంబం నుంచి మద్దతు లభించడం ఆనందంగా ఉంది."

- శ్రీజేష్

ఈ అవార్డు కోసం శ్రీజేష్​తో పాటు స్పెయిన్‌కు చెందిన అల్బెర్టో గినెస్ లోపెజ్​, ఇటలీకి చెందిన వుషు ప్లేయర్ మిచెల్ గియోర్డానోలు పోటీ పడ్డారు. విజేతను నిర్ణయించేందుకు ఆన్​లైన్​ ఓటింగ్​ నిర్వహించగా.. శ్రీజేష్​కు 1,27,647 ఓట్లు దక్కాయి. లోపెజ్​-67,428, గియోర్డానో-52,046 ఓట్లు మాత్రమే పొందారు.

శ్రీజేష్​.. ఎఫ్​ఐహెచ్​ గోల్​కీపర్​ ఆఫ్​ ది ఇయర్-2021​ పురస్కారాన్ని అందుకున్నాడు. ఇప్పటివరకు కెరీర్​లో మూడు సార్లు ఒలింపిక్స్​లో పాల్గొన్న అతడు.. దాదాపు 240కు పైగా అంతర్జాతీయ ప్రదర్శనలు చేశాడు. టోక్యో ఒలింపిక్స్​లో​ భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: Tim Bresans Retirement: క్రికెట్​కు ఇంగ్లాండ్ స్టార్​ ఆల్​రౌండర్​ గుడ్​బై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.