ETV Bharat / sports

'హాకీ దిగ్గజానికి భారతరత్న ఎప్పుడిస్తారో' - ధ్యాన్​చంద్​ కుమారుడు

భారత హాకీ దిగ్గజం.. మేజర్​ ధ్యాన్​చంద్​ సింగ్​కు భారతరత్న ఇవ్వాలని ఆయన తనయుడు అశోక్​ ధ్యాన్​చంద్​ కోరారు. ఈ విషయంపై ఎన్నోసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు.

ధ్యాన్​చంద్​కు భారత రత్న ఇవ్వాలని కోరిన తనయుడు అశోక్​ ధ్యాన్​చంద్​
author img

By

Published : Aug 29, 2019, 6:32 PM IST

Updated : Sep 28, 2019, 6:37 PM IST

హాకీ దిగ్గజం ధ్యాన్​చంద్​ పుట్టిన రోజైన ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రతీ ఏడాది జరుపుకుంటున్నారు. ఆయన జన్మించి నేటికి 115 వసంతాలు పూర్తయింది. ఈ సందర్భంగా ధ్యాన్​చంద్​ను భారతరత్న పురస్కారంతో సత్కరించాలని కోరారు ఆయన కుమారుడు అశోక్​ ధ్యాన్​చంద్​.

"హాకీలో ధ్యాన్​చంద్​ ప్రతిభను ప్రపంచమంతా గుర్తించింది. హాకీ ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరారు. భారత్​లో ఈ క్రీడ రూపాన్నే మార్చేసిన ధ్యాన్​చంద్​కు.. 1956లోనే భారత మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్​ వచ్చింది. అప్పటికి ఈ అవార్డు అందుకున్న మెదటి వ్యక్తి ఆయనే. ఆటే ప్రపంచంగా భావించి జీవితంలో ఎంతో సాధించారు. హాకీలో భారత్​ను ప్రపంచం నెం.1గా నిలబెట్టారు. అయినా ఇప్పటివరకు ధ్యాన్​చంద్​కు భారత రత్న ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు." -అశోక్​, ధ్యాన్​చంద్​ కుమారుడు

క్రీడారంగంలో భారతరత్నను 2013లో ప్రవేశపెట్టారు. క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ మొదటిగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ పురస్కారానికి సచిన్​ కంటే ముందే ధ్యాన్​చంద్ అర్హులని భావించారు చాలా మంది ప్రముఖులు. ఒలింపిక్స్​లో పతకాలు సాధించిన అనేక మందితో పాటు 2011లో 80 మంది కేంద్ర మంత్రులు ఈ విషయంపై డిమాండ్​ చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ధ్యాన్​చంద్​కు భారత రత్న ఇవ్వాలని కోరిన తనయుడు అశోక్​ ధ్యాన్​చంద్​

ఇదీ చూడండి: హాకీ కర్ర పట్టుకున్న మాంత్రికుడు.. ఈ చంద్రుడు

AP Video Delivery Log - 0900 GMT Horizons
Thursday, 29 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0339: HZ Mid East Cemetery AP Clients Only 4227101
Underground cemetery set to open
AP-APTN-1317: HZ Jordan Diving AP Clients Only 4227057
Submerged aircraft to create new coral reefs and diving site
AP-APTN-1209: HZ Kenya Elephants AP Clients Only 4227039
CITES votes to keep ban on sales in ivory
AP-APTN-1145: HZ Japan Self Driving Bus AP Clients Only 4227025
Autonomous bus trial ahead of 2020 Olympics
AP-APTN-1041: HZ Nepal Dying Art AP Clients Only 4226910
Modern printing methods killing off traditional art
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 28, 2019, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.