టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కెప్టెన్సీ(Virat Kohli Captaincy) వదులుకోవాలని ప్రధాన కోచ్ రవిశాస్త్రినే చెప్పారట. టెస్టుల్లో జట్టుకు సారథ్యం వహిస్తూ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడంలో భాగంగానే ఈ పని చేయమన్నట్లు సమాచారం.
అందుకేనా?
"ఈ సూచన కోహ్లీని తక్కువ చేయడానికి కాదు. ప్రపంచ క్రికెట్లో అతడు టాప్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగడం కోసమే" ఓ వార్త సంస్థ పేర్కొంది. విరాట్ మాత్రం శాస్త్రి సూచనలు వినకుండా కేవలం టీ20 సారథ్యాన్ని (Virat Kohli T20I Captaincy) మాత్రమే వదులుకొని, వన్డేల్లో కెప్టెన్‌గా కొనసాగుతున్నట్లు తెలిపింది.
రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీ లేకుండానే ఆస్ట్రేలియా సిరీస్ గెలిచింది టీమ్ఇండియా. నాటి నుంచి కోహ్లీ సారథ్యంపై చర్చలు మొదలయ్యాయి.
6 నెలల క్రితమే..
ఈ వ్యవహారంపై స్పందించిన ఓ బీసీసీఐ అధికారి.. 6 నెలల క్రితమే వైట్‌బాల్ కెప్టెన్సీ విషయమై కోహ్లీతో (Virat Kohli Captaincy) శాస్త్రి మాట్లాడినట్లు తెలిపారు.
"రవిశాస్త్రి చెప్పాడు కానీ కోహ్లీ వినలేదు. వన్డేల్లో సారథ్యం వదులుకోవడానికి అతడు సిద్ధంగా లేడు. అందుకే టీ20 కెప్టెన్సీ మాత్రమే విడిచిపెట్టాడు. కోహ్లీని బ్యాట్స్‌మన్‌గా మరింతగా ఉపయోగించుకోవడంపై బోర్డు కూడా చర్చిస్తోంది"
-బీసీసీఐ అధికారి
అంతర్జాతీయ టీ20 కెప్టెన్సీ (Virat Kohli Captaincy) వదులుకుంటున్నట్లు ఈ నెల 16న ప్రకటించాడు విరాట్. పని ఒత్తిడి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. దీంతో టీ20 జట్టుకు రోహిత్ శర్మను సారథిగా నియమించే అవకాశం ఉంది. మరోవైపు విరాట్ తీసుకున్న నిర్ణయంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు.
ఐపీఎల్‌లోనూ..
టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021) వరకే భారత టీ20 జట్టుకు సారథిగా ఉంటానని చెప్పిన ఈ స్టార్ క్రికెటర్.. ఐపీఎల్‌లోనూ (IPL) కెప్టెన్‌గా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆర్సీబీకి నాయకుడిగా (Kohli RCB Captaincy) ఈ సీజనే తనకు చివరిదని ప్రకటించాడు. క్రికెటర్‌గా తన కెరీర్ ముగిసే వరకు బెంగళూరు జట్టుతో (kohli rcb) కొనసాగుతానని విరాట్ చెప్పాడు.
ఆర్సీబీ VS కోల్‌కతా
ఐపీఎల్ రెండోదశలోని రెండో మ్యాచ్‌లో కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs KKR 2021) కోల్‌కతాతో తలపడింది. సీఎస్కే కంటే కాస్త మెరుగ్గానే ఇన్నింగ్స్ ప్రారంభించినా 92 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా.. 9 వికెట్ల తేడాతో అలవోకగా నెగ్గింది కోల్‌కతా.
ఇదీ చూడండి: IPL 2021: కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై ఈ సీజన్ మధ్యలోనే!