ETV Bharat / sports

'మా దేశం తరఫున ఆడు'.. సంజూ శాంసన్‌కు ఐర్లాండ్‌ ఆఫర్‌! - సంజూ శాంసన్ బంగ్లాదేశ్ టూర్

Sanju Samson Ireland : యువ బ్యాటర్ సంజూ శాంసన్‌కు ఐర్లాండ్‌ బోర్డు ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ దేశం తరఫున ఆడాలని అతడిని సంప్రదించినట్లు సమాచారం. అయితే ఐర్లాండ్‌ ఆఫర్‌ను సంజూ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

sanju samson
సంజూ శాంసన్
author img

By

Published : Dec 11, 2022, 10:44 PM IST

Sanju Samson Ireland : టీమ్‌ఇండియాలో సుస్థిర స్థానం కోసం చాలా రోజులుగా పోరాడుతున్న యువ బ్యాటర్ సంజూ శాంసన్‌కు ఐర్లాండ్ క్రికెట్‌ బోర్డు ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ దేశం తరఫున ఆడాలని అతడిని సంప్రదించినట్లు సమాచారం. అయితే, ఈ ఆఫర్‌ను సంజూ శాంసన్‌ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇటీవల భారత సెలక్షన్‌ కమిటీ.. జట్టులోకి ఎంపిక చేయకుండా శాంసన్‌ను విస్మరిస్తూ వస్తోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015లో తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఈ కేరళ కుర్రాడు.. ఇప్పటివరకు 27 మ్యాచుల్లోనే ఆడాడు. అందులో కూడా 2022లో ఆడినవే ఎక్కువ.

ఇటీవల జరిగిన ఆసియాకప్‌, టీ20 వరల్డ్‌కప్‌, తాజాగా బంగ్లాదేశ్‌ టూర్‌కు కూడా సంజూ శాంసన్‌ను బీసీసీఐ పక్కన పెట్టింది. కొన్ని మ్యాచ్‌ల్లో తప్ప మిగతావాటిలో అతడి ఆటతీరు కూడా అంత అభ్యంతరకరంగా లేకపోవడం వల్ల సెలక్టర్ల దృష్టిలో అతడు ఎందుకు పడటం లేదంటూ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని మ్యాచుల్లో అవకాశం కల్పిస్తామన్న నిబంధనతో ఐర్లాండ్‌ జట్టు.. తమ తరఫున ఆడాలని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే తాను భారత్‌ తరఫునే ఆడతానని, అవకాశం ఇచ్చినంత వరకు వేచి చూస్తానని సంజూ సమాధానం చెప్పినట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.