ETV Bharat / sports

బట్లర్​ రికార్డు సెంచరీ​.. ఆర్సీబీకి మళ్లీ నిరాశే.. ఫైనల్​లో గుజరాత్​తో రాజస్థాన్​ ఢీ - ఐపీఎల్​ ఫైనల్​ 2022

IPL 2022 Qualifier 2: రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుకు మళ్లీ నిరాశే ఎదురైంది. అనూహ్యంగా ఫ్లేఆఫ్స్​కు చేరిన ఆర్సీబీ.. శుక్రవారం క్వాలిఫయర్​ 2 మ్యాచ్​లో రాజస్థాన్​ చేతిలో ఓటమిపాలైంది. దీంతో సంజూ శాంసన్​ సేన ఫైనల్​కు చేరింది.

IPL 2022 Qualifier 2
IPL 2022 Qualifier 2
author img

By

Published : May 27, 2022, 11:07 PM IST

Updated : May 28, 2022, 12:13 AM IST

IPL 2022 Qualifier 2 RR Vs RCB: ఐపీఎల్​ 15వ సీజన్​ ఫైనల్​లోకి అడుగుపెట్టింది రాజస్థాన్​ రాయల్స్​. తొలి క్వాలిఫైయర్​లో గుజరాత్​ చేతిలో ఓటమిపాలైన రాజస్థాన్.. శుక్రవారం ఆర్సీబీతో జరిగిన క్వాలిఫైయర్​ 2 మ్యాచ్​లో​ అదరగొట్టింది. బెంగళూరుపై​ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదించింది సంజూసేన. ఓపెనర్‌ జోస్ బట్లర్ (106*; 60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరోసారి శతకంతో చెలరేగాడు. యశస్వీ జైస్వాల్ (21), సంజూ శాంసన్ (23) ఫర్వాలేదనిపించారు. బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్ 2, హసరంగ ఒక వికెట్ పడగొట్టారు.

తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో టాస్​ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు జట్టు మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బెంగళూరు ఆటగాళ్లలో రజత్ పాటిదార్‌ (58; 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా.. డుప్లెసిస్‌ (25), మ్యాక్స్‌వెల్ (24) ఫర్వాలేదనిపించారు. రాజస్థాన్‌ బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ, మెకాయ్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్‌, ట్రెంట్ బౌల్ట్ చెరో వికెట్ తీశారు. అహ్మదాబాద్‌ వేదికగా మే 29న జరగబోయే ఫైనల్​ మ్యాచ్​లో గుజరాత్​తో తలపడనుంది సంజూసేన.

బట్లర్​ రికార్డులు: ఐపీఎల్​ తొలి సీజన్​లో టైటిల్​ గెలిచిన రాజస్థాన్​ను.. మరో సెంచరీతో రెండోసారి ఫైనల్​కు చేర్చాడు బట్లర్. ఈ క్రమంలోనే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

  • ఈ సీజన్​లో బట్లర్​కు ఇది నాలుగో సెంచరీ. దీంతో ఒక ఐపీఎల్​ సీజన్​లో నాలుగు శతకాలతో కోహ్లీతో సమానంగా ఉన్నాడు బట్లర్. 2016లో కోహ్లీ కూడా 4 సెంచరీలు బాదాడు.
  • ఐపీఎల్​లో అత్యధిక శతకాలు (5) బాదిన వారిలో కోహ్లీతో సమానంగా రెండో స్థానంలో ఉన్నాడు బట్లర్. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (6 సెంచరీలు) అగ్రస్థానంలో ఉన్నాడు.
  • ఒక సీజన్​లో అత్యధిక పరుగులు చేసినవారిలో 824 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు బట్లర్. అతడి కన్నా ముందు కోహ్లీ (2016లో 973 పరుగులు), డేవిడ్ వార్నర్ (2016లో 848 పరుగులు) ఉన్నారు.

ఇవీ చదవండి: మేం ఫైనల్​కు వెళ్లడం కష్టమే: ఆర్సీబీ కెప్టెన్

వావ్​ పటిదార్‌.. 'బెంగళూరు' కోసం పెళ్లిని వాయిదా వేసుకున్నావా!

Last Updated : May 28, 2022, 12:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.