ఐపీఎల్ 14వ సీజన్‌లో(IPL 2021 Final) కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కు(CSK Vs KKR) చేరుకున్నాయి. అందరి కన్నా ముందు ధోనీసేన ప్లేఆఫ్స్(IPL Playoffs 2021) బెర్తును ఖరారు చేసుకోగా ఆఖరి నిమిషంలో మోర్గాన్ టీమ్ నాలుగో స్థానంతో పోటీలోకి వచ్చింది. ఇక్కడ ఆ జట్టు బెంగళూరు, దిల్లీ జట్లను ఓడించి తుదిపోరులో చెన్నైని ఢీకొట్టేందుకు సిద్ధమైంది. అయితే, కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కన్నా చెన్నై సారథి మహేంద్రసింగ్ ధోనీనే ఇప్పుడు బాగా ఆడుతున్నాడని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir News) అన్నాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ అతడీ వ్యాఖ్యలు చేశాడు.
"రెండు జట్ల కెప్టెన్లను పోల్చి చూడటం సరికాదు. ఎందుకంటే ధోనీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మరోవైపు మోర్గాన్ ఇంగ్లాండ్ జట్టుకు ఇంకా నాయకత్వం వహిస్తున్నాడు. దీంతో ఇద్దరినీ పోల్చి చూడటమంటే యాపిల్‌తో ఆరెంజ్‌ను పోల్చడమే. ధోనీ చాలా రోజులుగా సరైన క్రికెట్ ఆడటంలేని కారణంగా ఇప్పుడు పరుగులు చేయకపోయినా అర్థం చేసుకోవచ్చు. అలాగే మోర్గాన్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్న నేపథ్యంలో రాణించాల్సిన అవసరం ఉంది. అయినా, ఈ సీజన్‌లో ధోనీనే బాగా ఆడుతున్నాడు".
- గౌతమ్ గంభీర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ కెప్టెన్
మరోవైపు చెన్నై సారథి ఎంఎస్ ధోనీ.. బ్యాటింగ్, కెప్టెన్సీతో పాటు కీపింగ్ కూడా అదనంగా చేస్తున్నాడని గంభీర్ వివరించాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరినీ పోల్చిచూడటం సరికాదని వెల్లడించాడు.
ఇదీ చూడండి.. తొమ్మిదేళ్ల క్రితం చెన్నైకి షాక్ ఇచ్చిన కేకేఆర్.. ఇప్పుడు ఏం చేస్తారో?