ETV Bharat / sports

CSK vs KKR Final: నెట్స్​లో ధోనీ హెలికాప్టర్​ షాట్.. వీడియో వైరల్

ఐపీఎల్​ 14(IPL 2021) సీజన్​ తుది పోరు శుక్రవారం జరగనున్న నేపథ్యంలో చెన్నై సూపర్​ కింగ్స్(CSK vs KKR 2021)​ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో ధోనీ హెలికాప్టర్​ షాట్​తో అదరగొట్టిన తీరు నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఈ పోరులో చెన్నై సూపర్​ కింగ్స్​తో తలపడనుంది కోల్​కతా నైట్​రైడర్స్​.

author img

By

Published : Oct 15, 2021, 11:10 AM IST

dhoni
ధోనీ

ఐపీఎల్​ 14(IPL 2021) తుది సమరం శుక్రవారం సాయంత్రం జరగనుంది. తొమ్మిదో సారి ఫైనల్​కు చేరిన చెన్నై సూపర్​ కింగ్స్​తో(CSK vs KKR Final) జోరు మీదున్న కోల్​కతా నైట్​ రైడర్స్​తో పోటీ పడనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లూ నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తూ.. అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఫైనల్​ మ్యాచ్​ నేపథ్యంలో.. నెట్స్​​లో ప్రాక్టీస్​ చేస్తున్న తమ ఆటగాళ్ల వీడియోను పోస్ట్ చేసింది చెన్నై సూపర్​ కింగ్స్(CSK IPL). ఈ ప్రాక్టీస్​ సెషన్​లో ధోనీ హెలికాప్టర్​​ షాట్​తో అదరగొట్టాడు. ఈ వీడియో అభిమానులను బాగా ఆకర్షిస్తోంది. గత మ్యాచ్​కు దూరమైన సురేష్​ రైనా కూడా ఈ ప్రాక్టీస్​ సెషన్​లో పాల్గొన్నాడు. దీంతో అతడు తుది పోరులో ఆడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

ఐపీఎల్‌లో చెన్నై ఇప్పటివరకు మూడుసార్లు ట్రోఫీ గెలవగా.. కేకేఆర్​ రెండు సార్లు కప్పును ముద్దాడింది. ఇరు జట్లు తుదిపోరులో నెగ్గి ట్రోఫీని సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్​ నేడు(అక్టోబర్​ 15) రాత్రి 7.30గంటలకు ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి:

'ఈ ఏడాది కోహ్లీతో జరిగిన పోరు మరిచిపోలేను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.