ETV Bharat / sports

బెంగళూరుపై హైదరాబాద్ గెలుపు.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం

author img

By

Published : Oct 31, 2020, 10:57 PM IST

Updated : Oct 31, 2020, 11:30 PM IST

ఆర్సీబీపై గెలిచిన సన్​రైజర్స్.. ప్లేఆఫ్స్ ఆశల్ని మెరుగుపరుచుకుంది. తర్వాతి మ్యాచ్​లో ముంబయిపై గెలవాలి లేదంటే ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తుంది.

SRH BEAT RCB BY 5 WICKETS
బెంగళూరుపై హైదరాబాద్ గెలుపు.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం

బెంగళూరుపై హైదరాబాద్​ ఘన విజయం సాధించింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో 5 వికెట్లు కోల్పోయి, 14.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవం చేసుకుంది.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన బెంగళూరు.. ప్రారంభం నుంచి తడబడింది. సన్​రైజర్స్​ బౌలర్ల ధాటిగా పరుగులు చేయడానికి కష్టపడింది. మరోవైపు వికెట్లు కూడా కోల్పోయారు.

ఆర్సీబీ బ్యాట్స్​మెన్​లో ఫిలిప్పీ(32), దేవదత్​(5), కోహ్లీ(7), డివిలియర్స్(24), సుందర్(21), గుర్​కీరత్ సింగ్(15), మోరిస్(3), సిరాజ్(2) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. సన్​రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, హోల్డర్ తలో రెండు వికెట్లు.. రషీద్ ఖాన్, నటరాజన్, రషీద్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం ఛేదన మొదలుపెట్టిన హైదరాబాద్.. ధాటిగా ఇన్నింగ్స్​ ఆరంభించింది. అయితే ఓపెనర్ వార్నర్ 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన మనీశ్ పాండే(26).. మరో ఓపెనర్ సాహా(39)తో కలిసి నెమ్మదిగా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఔటయ్యారు. విలియమ్సన్(8), అభిషేక్ శర్మ(8), హోల్డర్(26) లాంఛనాన్ని పూర్తి చేశారు. ఆర్సీబీ బౌలర్లలో చాహల్ 2 వికెట్లు, ఉదానా, సైనీ, సుందర్ తలో వికెట్ పడగొట్టారు.

Last Updated : Oct 31, 2020, 11:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.