ETV Bharat / sports

'తొలి ఆస్ట్రేలియా పర్యటన చాలా నేర్పింది' - సచిన్​ మొదటి రోజులు

తన తొలి ఆస్ట్రేలియా పర్యటన వల్ల టెక్నికల్‌గానే కాకుండా పెద్ద టోర్నీల్లో మానసికంగా ఎలా ఆడాలో తెలిసిందని క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ తెలిపాడు. మొదట్లో తాను కూడా బంతిపై ప్రతాపం చూపేవాడినని, సమయం గడిచేకొద్దీ పరిణతి పెరిగిందని వెల్లడించాడు.

team india former cricketer Sachin tendulkar about his first australia tour
తొలి ఆస్ట్రేలియా పర్యటన చాలా నేర్పింది:సచిన్​
author img

By

Published : Dec 21, 2020, 12:18 PM IST

1991-92 సీజన్‌లో తన తొలి ఆస్ట్రేలియా పర్యటన ఎంతో నేర్పిందని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం టీమ్‌ఇండియా ఆసీస్‌లో పర్యటిస్తోంది. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన ఘోర పరాభవం పాలైన నేపథ్యంలో తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన సచిన్‌.. తన మొదటి పర్యటన టెక్నికల్‌ విషయాలపైనే కాకుండా మానసికంగా ఎలా సన్నద్ధమవ్వాలో నేర్పిందని చెప్పాడు.

"అప్పట్లో చాలా మంది పేస్‌, బౌన్స్‌ గురించి మాట్లాడేవారు, ఒక బౌలర్‌ అలా బంతులేయాలంటే కచ్చితమైన లెంగ్త్‌ అవసరం. దానికి ఆ బౌలర్‌ పిచ్‌ మీద నిర్దిష్టమైన ప్రాంతం కనుగొనాలి. కానీ, అదెంతో కష్టతరమైన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాట్స్‌మెన్‌ సానుకూల ధోరణితో ముందుకు సాగితే పరుగులు చేయడానికి చాలా అవకాశాలుంటాయి. నేను అలానే చేసేవాడిని. మొదట్లో నేను కూడా బంతిపై ప్రతాపం చూపేవాడిని, సమయం గడిచేకొద్దీ నా పరిణతి పెరిగింది. ఎప్పుడూ బంతిపై ఎదురుదాడి చేయడం కాకుండా, పరిస్థితులను అర్థం చేసుకొని బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నా. పేస్‌ను బట్టి షాట్లను ఎంపిక చేసుకోవాలి. ఒక్కోసారి ఆ షాట్లు కుదరకపోయినా అలాగే ప్రయత్నించేవాడిని."

-సచిన్​​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​.

1991-92లో ఆడేటప్పుడు తనని ఎవరూ టీనేజ్‌ కుర్రాడిలా చూసేవారు కాదని, ఎంతసేపూ పెవిలియన్‌ పంపడానికి విశ్వ ప్రయత్నాలు చేసేవారని సచిన్‌ గుర్తుచేసుకున్నాడు. తాను కూడా అలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేవాడినని చెప్పాడు. ఆ పర్యటన తనని టెక్నికల్‌గానే కాకుండా పెద్ద టోర్నీల్లో మానసికంగా ఎలా ఆడాలో తెలియజేసిందని వివరించాడు. కాగా, సచిన్‌ నాటి 5 టెస్టుల పర్యటనలో రెండు శతకాలు బాదాడు. సిడ్నీలో 148, పెర్త్‌లో 114 పరుగులు చేసి అందర్నీ ఆశ్యర్యంలో ముంచెత్తాడు. ఆ సిరీస్‌లో భారత్‌ 4-0 తేడాతో ఓటమిపాలైంది.

ఇదీ చూడండి:ఆసీస్​తో సిరీస్​లో టీమ్ఇండియా ముందున్న సవాళ్లివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.