ETV Bharat / sports

వారిపై ఎలాంటి ఒత్తిడి పెట్టను: రహానే - రెండో మ్యాచ్

టెస్టుల్లో ఓపెనర్ల పాత్ర చాలా కీలకమని తాత్కాలిక కెప్టెన్ రహానె పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందు కీలక వ్యాఖ్యలు చేశాడు.

Aus vs Ind: Opener's role is crucial, but don't want to put pressure, says Rahane
వారిపై ఎలాంటి ఒత్తిడి పెట్టను:రహానే
author img

By

Published : Dec 25, 2020, 4:12 PM IST

ఆసీస్​తో రెండో టెస్టులో తమ ఓపెనర్లపై ఎలాంటి ఒత్తిడి పెట్టనని టీమ్​ఇండియా తాత్కాలిక కెప్టెన్ రహానె చెప్పాడు. ఈ ఫార్మాట్​లో వారి పాత్రే కీలకమని అన్నాడు. తొలి టెస్టులో ఘోర పరాభవం తర్వాత మెల్​బోర్న్​ వేదికగా రెండో పోరుకు సిద్ధమవుతోంది. శనివారం(డిసెంబరు 26) ఉదయం నుంచే మ్యాచ్​ ప్రారంభం కానుంది.

"ఆస్ట్రేలియాతో మ్యాచ్​లోనే కాదు. ఎక్కడైనా ఓపెనర్ల పాత్రే చాలా కీలకం. అందుకే నేను వారిపై ఎలాంటి ఒత్తిడి పెట్టాలనుకోవడం లేదు. వాళ్లకు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. దీంతో ఓపెనర్ల తర్వాత బ్యాటింగ్ చేసేవారికి సులభంగా ఉంటుంది. మాకు కోహ్లీ లేని లోటు కచ్చితంగా ఉంటుంది. అతను ఉంటే మ్యాచ్​ గొప్పగా ఉండేది"

--అజింక్య రహానె, టీమ్​ఇండియా తాత్కాలిక టెస్టు కెప్టెన్

రెండో టెస్టు కోసం తామంతా బాగా సన్నద్ధమయ్యామని చెప్పాడు రహానే. తొలి టెస్టులో అనుసరించిన వ్యూహాలతోనే రెండో మ్యాచ్​లోనూ చక్కగా ఆడేందుకు ప్రయత్నిస్తామని అన్నాడు. అడిలైడ్​ వేదికగా జరిగిన తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్​లో 36 పరగులు చెదిరిపోని చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది టీమ్​ఇండియా. సిరీస్​పై ఆశలు నిలుపుకోవాలంటే ప్రస్తుత టెస్టు​లో భారత్​ సత్తా చాటాల్సిందే.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.