భారత్- ఇంగ్లాండ్ తొలి టెస్టు నాలుగో రోజు భోజన విరామ సమయానికి ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లకు 119/2 స్కోర్‌తో నిలిచింది. ఈ సెషన్‌లో మొత్తం ఇంగ్లాండ్ 94 పరుగులు జోడించి రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం జోరూట్(56), డామ్ సిబ్లీ(27) పరుగులతో ఉన్నారు. వీరిద్దరూ 73 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు.
అంతకుముందు 25/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో శనివారం నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లాండ్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రోరీ బర్న్స్(18), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ జాక్ క్రాలీ(6) విఫలమయ్యారు. సిరాజ్ బౌలింగ్‌లో బర్న్స్, బుమ్రా బౌలింగ్‌లో క్రాలీ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 46/2గా ఉంది. తర్వాత జోడీ కట్టిన రూట్, సిబ్లీ మరో వికెట్ పడకుండా తొలి సెషన్‌ను ముగించారు.
ఇదీ చదవండి: రాహుల్ ఆటలో ఇంత మార్పు ఎలా?