ICC T20 2024 Schedule: 2024 టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ శుక్రవారం ఐసీసీ విడుదల చేసింది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇక ఈ టోర్నమెంట్ 2024 జూన్ 1న యూఎస్ఏ వర్సెస్ కెనడ మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. ఆమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికలుగా 29 రోజుల పాటు ఈ టోర్నీ సాగనుంది. మొత్తం రెండు సెమీస్, ఫైనల్ సహా టోర్నీలో 55 మ్యాచ్‌లు జరగనున్నాయి.ఇక టోర్నీలో హై ఓల్టేజ్ మ్యాచ్ భారత్- పాకిస్థాన్ జూన్ 9న తలపడనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్‌కు న్యూయార్క్ వేదిక కానుంది. . కాగా, జూన్ 29న బర్బాడోస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
టోర్నీలో భారత్ గ్రూపు స్టేజ్ మ్యాచ్‌లు
- 4th జూన్ vs ఐర్లాండ్ - న్యూయార్క్
- 9th జూన్ vs పాకిస్థాన్- న్యూయార్క్
- 12th జూన్ vs యూఎస్ఏ- న్యూయార్క్
- 15th జూన్ vs కెనడ- న్యూయార్క్
-
Get ready for the ultimate cricket carnival in the West Indies and the USA 🥁
— ICC (@ICC) January 5, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Unveiling the fixtures for the ICC Men’s T20 World Cup 2024 🗓️ 🤩#T20WorldCup | Details 👇
">Get ready for the ultimate cricket carnival in the West Indies and the USA 🥁
— ICC (@ICC) January 5, 2024
Unveiling the fixtures for the ICC Men’s T20 World Cup 2024 🗓️ 🤩#T20WorldCup | Details 👇Get ready for the ultimate cricket carnival in the West Indies and the USA 🥁
— ICC (@ICC) January 5, 2024
Unveiling the fixtures for the ICC Men’s T20 World Cup 2024 🗓️ 🤩#T20WorldCup | Details 👇
-
గ్రూప్ A | గ్రూప్ B | గ్రూప్ C | గ్రూప్ D |
భారత్ | ఇంగ్లాండ్ | న్యూజిలాండ్ | సౌతాఫ్రికా |
పాకిస్థాన్ | ఆస్ట్రేలియా | వెస్టిండీస్ | శ్రీలంక |
ఐర్లాండ్ | నమీబియా | అఫ్గానిస్థాన్ | బంగ్లాదేశ్ |
కెనడ | స్కాట్లాండ్ | ఉగాండ | నెదర్లాండ్స్ |
యూఎస్ఏ | ఒమన్ | పపువా న్యూ గునియా | నేపాల్ |
కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న పొట్టి ప్రపంచకప్ షెడ్యూల్ రావడం వల్ల ఆయా జట్లు ఇక టోర్నీకి సిద్ధం కానున్నాయి. అయితే టీమ్ఇండియాలో స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2022 వరల్డ్‌కప్ తర్వాత మళ్లీ పొట్టి ఫార్మాట్లో ఆడలేదు. అయితే తాజాగా వీరిద్దరూ టీ20ల్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐకి తెలిపారట. ఇదివరకూ కూడా 2024 టీ20 వరల్డ్‌కప్ కెప్టెన్ ఎంపికకు రోహిత్ శర్మే ఫస్ట్ ఛాయిస్ అని అప్పట్లో బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో!
Afghanistan Tour Of India 2024: అఫ్గానిస్థాన్ ఈ నెల భారత్ పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. అయితే టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య గాయం నుంచి కోలుకోలేదు. మరి జట్టు సారథ్య బాధ్యతలు రోహిత్ శర్మ లేదా సూర్యకుమార్ యాదవ్‌కు కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి.
'టీ20లు ఆడేందుకు మేము రెడీ'- బీసీసీఐతో రోహిత్, విరాట్
పొట్టి వరల్డ్ కప్- భారత్ X పాక్ మ్యాచ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే?