ICC Rankings 2023 : ఐసీసీ బుధవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ మళ్లీ అగ్రస్థానం దక్కించుకున్నాడు. అతడు 824 రేటింగ్స్‌తో టాప్ పొజిషన్‌కు చేరుకున్నాడు. టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (810 రేటింగ్స్) రెండో స్థానానికి పడిపోయాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (775 రేటింగ్స్), కెప్టెన్ రోహిత్ శర్మ (754 రేటింగ్స్) వరుసగా మూడు, నాలుగు ప్లేస్ల్లో కొనసాగుతున్నారు. ఇక టీ20 బౌలింగ్ విభాగంలో ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ (715 రేటింగ్స్) రెండు స్థానాలు మెరుగుపర్చుకొని నెం.1 ర్యాంక్ సొంతం చేసుకున్నాడు.
-
New No.1 T20I bowler 🏅
— ICC (@ICC) December 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
New No.1 ODI batter 🏅
Wholesale changes at the top of the charts in the latest @MRFWorldwide ICC Men's Player Rankings 😲https://t.co/Q4Qusm53Q5
">New No.1 T20I bowler 🏅
— ICC (@ICC) December 20, 2023
New No.1 ODI batter 🏅
Wholesale changes at the top of the charts in the latest @MRFWorldwide ICC Men's Player Rankings 😲https://t.co/Q4Qusm53Q5New No.1 T20I bowler 🏅
— ICC (@ICC) December 20, 2023
New No.1 ODI batter 🏅
Wholesale changes at the top of the charts in the latest @MRFWorldwide ICC Men's Player Rankings 😲https://t.co/Q4Qusm53Q5
అయితే కొద్దిరోజులుగా శుభ్‌మన్ గిల్ నుంచి అత్యుత్తమ ప్రదర్శనలు నమోదు కాలేదు. దీంతో గిల్ ఒక స్థానం కిందకు పడిపోయాడు. ఇక టాప్ 5లో ముగ్గురు టీమ్ఇండియా బ్యాటర్లే ఉండడం విశేషం. స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ ( 696 రేటింగ్స్)12వ ప్లేస్‌లో ఉండగా, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ (674 రేటింగ్స్) ఒక స్థానం మెరుగుపర్చుకొని 16వ స్థానంలో కొనసాగుతున్నాడు.
టాప్ 5 - వన్డే బ్యాటర్లు
- బాబర్ అజామ్ (పాకిస్థాన్)- 824 రేటింగ్స్
- శుభ్‌మన్ గిల్ (భారత్)- 810 రేటింగ్స్
- విరాట్ కోహ్లీ (భారత్)- 775 రేటింగ్స్
- రోహిత్ శర్మ (భారత్)- 754 రేటింగ్స్
- డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 745 రేటింగ్స్
టాప్ 5- టీ20 బౌలర్లు
- ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్)- 715 రేటింగ్స్
- రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్)- 692 రేటింగ్స్
- రవి బిష్ణోయ్ (భారత్)- 685 రేటింగ్స్
- వానిందు హసరంగా (శ్రీలంక)- 679 రేటింగ్స్
- మషీశ్ తీక్షణ (శ్రీలంక)- 677 రేటింగ్స్
ICC T20 Batting Rankings : టీ20 బ్యాటర్ల తొలి రెండు ర్యాంకుల్లో పెద్దగా మార్పుల్లేవ్. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 887 రేటింగ్స్‌తో టాప్‌లో ఉండగా, పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 787 రేటింగ్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అంటే టాప్‌లో ఉన్న సూర్యకు, రిజ్వాన్‌కు 100 రేటింగ్స్ తేడా ఉంది. దీంతో గతేడాది టీ20 వరల్డ్‌కప్ అనంతరం టాప్ ప్లేక్కు చేరిన సూర్య, 2024 పొట్టి ప్రపంచకప్ వరకూ అదే అగ్ర స్థానంలోనే ఉండే ఛాన్స్ ఉంది.
ఎవరూ టచ్ చేయనంత దూరంలో సూర్య- 2024 వరల్డ్‌కప్ దాకా పొజిషన్ సేఫ్!- ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ రిలీజ్
బిష్ణోయ్ కెరీర్ బెస్ట్ పొజిషన్ - తొలిసారి టాప్ ప్లేస్‌కు - టీ20 ర్యాంకింగ్స్ రిలీజ్