ETV Bharat / sports

క్రికెట్​లో విషాదం.. దిగ్గజ అంపైర్​ కన్నుమూత.. గోల్ఫ్​ ఆడి వస్తుండగా..

author img

By

Published : Aug 9, 2022, 6:41 PM IST

Rudi Koertzen Died: క్రికెట్​లో పెను విషాదం చోటుచేసుకుంది. సౌతాఫ్రికాకు చెందిన మాజీ అంపైర్​ రూడి కొయిర్ట్జెన్​ కన్నుమూశారు. కారు ప్రమాదంలో మంగళవారం ఉదయం ఆయన చనిపోయారు.

Former South African umpire Rudi Koertzen Died in car crash

Rudi Koertzen Died: దక్షిణాఫ్రికాకు చెందిన దిగ్గజ క్రికెట్ మాజీ​ అంపైర్​ రూడి కొయిర్ట్జెన్​ ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు స్థానిక వెబ్​సైట్​ పేర్కొంది. 73 ఏళ్ల కొయిర్ట్జెన్​.. దాదాపు 400 అంతర్జాతీయ క్రికెట్​ మ్యాచ్​లకు అంపైర్​గా పనిచేశారు. 1990-2010 మధ్య గొప్ప అంపైర్​గా పేరుగాంచారు. కొయిర్ట్జెన్​కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.

రివర్స్​డేల్​ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనతో సహా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కేప్​ టౌన్​లో గోల్ఫ్​ వీకెండ్​ ముగించుకొని.. ఇంటికి తిరుగు పయనమైన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. తన తండ్రి మరణవార్తను రూడి కొయిర్ట్జెన్​ జూనియర్​ ధ్రువీకరించారు. కొయిర్ట్జెన్​ మృతి పట్ల ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, అంపైర్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.

కొయిర్ట్జెన్​ 2002లో ఐసీసీ ఎలైట్​ ప్యానెల్​లో చోటు సంపాదించారు. దాదాపు ఎనిమిదేళ్లు ఈ హోదాలో కొనసాగారు. మొత్తం తన కెరీర్​లో 397 మ్యాచ్​లకు ఆన్​ ఫీల్డ్​ అండ్​ టీవీ అంపైర్​గా ఉన్నారు. ఇందులో 128 టెస్టులు, 250 వన్డేలు, 19 టీ-20లు ఉన్నాయి.
ఈ దిగ్గజ అంపైర్ కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరిగిన 2007 వన్డే ప్రపంచకప్​ ఫైనల్​ను.. వెలుతురు సరిగా లేకున్నా నిర్వహించారన్న ఆరోపణ ఉంది. ఐసీసీ నిబంధనను అతిక్రమించిన కారణంగా.. అదే ఏడాది తన సొంత దేశంలో జరిగిన తొలి టీ-20 ప్రపంచ కప్​లో.. కొయిర్ట్జెన్​ను ఐసీసీ పక్కనబెట్టింది. ​

ఇవీ చూడండి: పంత్​పై రోహిత్​ ఫైర్​.. ఎందుకంటే?

టీమ్​ఇండియాకు బిగ్​ షాక్​.. ఆసియా కప్​కు స్టార్​ ప్లేయర్​​ దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.