టీమ్ఇండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా క్షమాపణలు చెప్పినా ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ పట్టించుకోలేదని ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ వెల్లడించాడు. లార్డ్స్ టెస్టులో మూడో రోజు బుమ్రా అనుకోకుండా బౌన్సర్లు వేసిన కారణంగా అండర్సన్‌కు క్షమాపణ కోరేందుకు వెళ్లాడని, అయితే ఆ సమయంలో అండర్సన్ పట్టించుకోలేదని ఆయన తెలిపాడు.
"బుమ్రా పోటీతత్వం ఉన్న ఫాస్ట్ బౌలర్.. అయినా ఎవ్వరిని కావాలని బాధించలేదు. బుమ్రా వరుసగా 8-10 బంతులు విసిరాడు. ఆ యార్కర్లు, బౌన్సర్లతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ అండర్సన్ కొంత అసౌకర్యానికి గురయ్యాడు. ఫాస్ట్ బౌలర్ల క్లబ్లో అంతకుముందు ఓ ఒప్పందం ఉండేది. అదేంటంటే బౌలర్లు ఎట్టి పరిస్థితుల్లో బౌన్సర్లు సంధించకూడదు. ఇప్పుడా క్లబ్ లేదు".
- ఆర్. శ్రీధర్, టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్
"లార్డ్స్ టెస్టులో మూడో రోజు బుమ్రా బౌలింగ్‌లో కొన్ని బౌన్సర్లు వచ్చాయి. ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే మాట్లాడేందుకు అండర్సన్ వద్దకు బుమ్రా వెళ్లాడు. తాను ఉద్దేశపూర్వకంగా బౌన్సర్లు వేయలేదని చెప్పేందుకు జిమ్మీకి చెప్పగా.. అతడిని అసలు పట్టించుకోలేదు. దాని ప్రభావం మ్యాచ్ ఐదో రోజు మైదానంలో కనిపించింది" అని టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ అన్నాడు.
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో 151 పరుగుల తేడాతో టీమ్ఇండియా గెలిచింది. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్‌కు పేసర్లు బుమ్రా(34 నాటౌట్), షమి(56 నాటౌట్) అత్యధికంగా 89 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి, భారత్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఇదీ చూడండి.. టీమ్ఇండియా క్రికెట్లో పడి లేచిన కెరటం