క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. యూనిసెఫ్ గుడ్విల్కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఆయన.. అసోంలోని ఓ ఛారిటబుల్ ఆసుపత్రికి వైద్య పరికరాలను అందజేశాడు. సచిన్ సాయం వల్ల రెండువేల మంది పేద చిన్నారులు లబ్ధి పొందనున్నారు. కరీంగంజ్ జిల్లా ముకుంద ఆసుపత్రిలో పిల్లల అత్యవసర విభాగానికి, శిశు అత్యవసర చికిత్స విభాగానికి ఈ పరికరాలను అందించాడు సచిన్.
సచిన్ సాయం పట్ల ముకుంద ఆసుపత్రికి చెందిన పిల్లల శస్త్రచికిత్స నిపుణుడు డా.విజయ్ ఆనంద్ ఇస్మాయల్ కృతజ్ఞతలు చెప్పారు. తెందుల్కర్ ఫౌండేషన్, ఏకం ఫౌండేషన్ సహకారంతో ఆ ప్రాంతంలోని పేదలకు తక్కువ ధరలోనే ఉత్తమ వైద్యం అందించగలుగుతామని అన్నారు.
తెందుల్కర్ ఫౌండేషన్ తరఫున మధ్యప్రదేశ్లోని గిరిజన వర్గాల ప్రజలకు పోషకాహారాన్ని అందించడంలోనూ సచిన్ సహాయపడ్డాడు. ఈ కార్యక్రమం సాయంతో ఈశాన్య రాష్ట్రాల్లోని ఎంతో మంది పేదలు లబ్ధి పొందారు.
ఇదీ చదవండి:నేను చూసిన వారిలో కోహ్లీ ది బెస్ట్: ఆస్ట్రేలియా కోచ్