భారత యువ ఆల్‌రౌండర్, ఐపీఎల్లో సన్‌రైజర్స్ జట్టు ఆటగాడు విజయ్ శంకర్ ఓ ఇంటివాడయ్యాడు. తమిళనాడుకు చెందిన వైశాలి, విజయ్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్.. తన అధికారిక ట్విట్వర్ ఖాతాలో పోస్టు చేసింది.
"ఈ ప్రత్యేకమైన రోజున మా తరఫున విజయ్ శంకర్‌కు శుభాకాంక్షలు.. మీకు సంతోషకరమైన వివాహ జీవితం ఉండాలని కోరుకుంటున్నాం," అని సన్‌రైజర్స్ పోస్టు చేసింది.
విజయ్ శంకర్ 2018లో కొలంబో వేదికగా జరిగిన టీ20లో టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. మరుసటి ఏడాదే ఆస్ట్రేలియాపై మెల్‌బోర్న్‌లో వన్డే కెరీర్‌ను ఆరంభించాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్-2019లోనూ ఆడాడు.
ఇదీ చదవండి: బయో బబుల్‌లో ఉండటంపై ఆసీస్ కెప్టెన్ ఆందోళన