ETV Bharat / sports

రోహిత్​ను అందుకే ఎంపిక చేయలేదు: కోచ్ రవిశాస్త్రి

author img

By

Published : Nov 1, 2020, 5:54 PM IST

రోహిత్ శర్మ గాయం గురించి మాట్లాడిన కోచ్ రవిశాస్త్రి.. హిట్​మ్యాన్ మరోసారి గాయపడితే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని, అందుకే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయలేదని అన్నాడు.

Rohit's medical report says he could be in danger of injuring himself again, says Ravi Shastri
మెడికల్ రిపోర్ట్ ప్రకారమే జట్టుకు రోహిత్ దూరం

టీమ్​ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయం గురించి కోచ్ రవిశాస్త్రి మాట్లాడాడు. వైద్య నివేదిక పరిశీలించిన తర్వాతే ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టులోకి తీసుకోలేదని చెప్పారు. మరోసారి గాయపడితే మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

"రోహిత్ మెడికల్ రిపోర్ట్ పరిశీలించిన తర్వాతే జట్టును ప్రకటించాం. గాయం గురించి వైద్యులు చూసుకుంటారు. దానిపై మేం ఏం చేయలేం. రోహిత్ గాయంపై వైద్యబృందం సెలక్టర్లకు ఓ రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం రోహిత్ మరోసారి గాయపడితే మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఓ క్రీడాాకారుడికి చిరాకు కలిగించే విషయాల్లో గాయాలు కూడా భాగమే. దాని నుంచి ఎంత త్వరగా బయటపడాలన్న దాని గురించి ఆలోచించాలి. నాకూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. 1991లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లా. డాక్టర్లు చెప్పినట్లు విని ఆ సిరీస్​కు వెళ్లకుండా ఉండి 3-4 నెలలు విరామం తీసుకుంటే మరో ఐదేళ్లు ఎక్కువగా ఆడేవాడిని. రోహిత్​ కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు"

-రవిశాస్త్రి, టీమ్​ఇండియా కోచ్

సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ గాయంపైనా స్పందించాడు రవిశాస్త్రి. రోహిత్, ఇషాంత్ లాంటి ప్రపంచస్థాయి ఆటగాళ్లను కోల్పోవడం జట్టుకు పెద్ద లోటని చెప్పాడు. ఆస్ట్రేలియా గత పర్యటనలో ఇషాంత్ అద్భుత ప్రదర్శన చేశాడని.. అలాగే దక్షిణాఫ్రికాపై గెలవడంలో రోహిత్ కీలకపాత్ర పోషించాడని గుర్తు చేసుకున్నాడు. రాహుల్​కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడంపై స్పందిస్తూ.. గతంలో న్యూజిలాండ్​తో టీ20 సమయంలో కోహ్లీ, రోహిత్ గైర్హాజరుతో రాహుల్ జట్టును ముందుండి నడిపించాడని తెలిపాడు.

ఆస్ట్రేలియా పర్యటన కోసం ఇటీవలే ప్రకటించిన టీమ్​ఇండియా జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. అతడి గాయమైందని, ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తున్నామని బీసీసీఐ తెలిపింది. కానీ జట్టు ప్రకటించిన కాసేపటికే రోహిత్ నెట్స్​లో ప్రాక్టీస్ చేయడం పలు అనుమానాలకు తావిచ్చింది. దీంతో హిట్​మ్యాన్ గాయంపై స్పష్టతనివ్వాలని అభిమానులతో పాటు సీనియర్ క్రికెటర్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి మాట్లాడారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.