ETV Bharat / sports

ప్రాక్టీస్​లో రోహిత్.. మరి బీసీసీఐ ఎందుకలా చెప్పింది? - Rohit Sharma latest news

ఆస్ట్రేలియాతో పర్యటనకు టీమ్​ఇండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను మాత్రం ఎంపిక చేయలేదు. అతడు గాయపడ్డాడని అందుకే జట్టుకు దూరమయ్యాడని సెలక్షన్ కమిటీ వెల్లడించింది. కానీ రోహిత్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న చిత్రాలను చూస్తుంటే అతడు గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది.

Rohit Sharma's Training Pics After India Omission Leave Fans Confused
రోహిత్​ ప్రాక్టీస్.. మరి బీసీసీఐ ఎందుకలా చెప్పింది?
author img

By

Published : Oct 27, 2020, 10:27 AM IST

ఆస్ట్రేలియా పర్యటన కోసం ప్రకటించిన టీమ్​ఇండియా జట్టుకు సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మను ఎంపిక కాలేదు. రోహిత్ గాయపడ్డాడని.. అతడి పరిస్థితిని పరిశీలిస్తున్నామని బీసీసీఐ తెలిపింది. టీమ్​ఇండియా పర్యటనకు వెళ్లే సమయానికి కోలుకుంటే అతడు కూడా జట్టుతో వెళ్తాడని పేర్కొంది. అయితే వీరు చెప్పింది ఇలా ఉంటే రోహిత్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

ఏం జరుగుతోంది?

గాయం కారణంగా అతడు ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడని అంటోంది బీసీసీఐ. కానీ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించగానే రోహిత్​ ప్రాక్టీస్​ చేస్తున్న ఫొటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. అతడు కోలుకున్నాడని.. మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడని ముంబయి ఇండియన్స్ ట్వీట్ చేసింది. దీంతో అభిమానులు గందరగోళంలో పడ్డారు. రోహిత్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తుంటే గాయం అయిందని బీసీసీఐ చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆస్ట్రేలియాతో టీ20, వన్డే, టెస్టు పర్యటన కోసం జట్లను ప్రకటించింది టీమ్​ఇండియా సెలక్షన్ కమిటీ. మూడు ఫార్మాట్లకు కెప్టెన్​గా విరాట్ కోహ్లీ ఉండగా, టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్​గా రహానే, వన్డే, టీ20లకు కేఎల్ రాహుల్​కు అవకాశం కల్పించింది. అయితే ఎప్పటి నుంచో రోహిత్ పరిమిత ఓవర్ల జట్టుకు వైస్ కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు.

  • NEWS - Four additional bowlers - Kamlesh Nagarkoti, Kartik Tyagi, Ishan Porel and T. Natarajan - will travel with the Indian contingent.

    The BCCI Medical Team will continue to monitor the progress of Rohit Sharma and Ishant Sharma. #AUSvIND

    — BCCI (@BCCI) October 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.