న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా కివీస్‌తో జరిగే వన్డే, టెస్టు సిరీస్‌కు స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఇతడి స్థానంలో మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.
"రోహిత్ కివీస్ పర్యటనకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడి గాయం కోలుకునేలా లేదు. ఆ గాయం ఎంత పెద్దదో తెలుసుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. సెక్రటరీ అనుమతి తర్వాత మరో ఆటగాడిని ఎంపిక చేస్తాం."
-బీసీసీఐ అధికారి
కివీస్‌తో జరిగిన చివరిదైన ఐదో టీ20లో గాయపడ్డాడు రోహిత్. 60 పరుగులు చేసి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం ఫీల్డింగ్ చేయడానికి రాలేదు. ప్రస్తుతం ఈ గాయం నుంచి కోలుకునే అవకాశం లేకపోవడం వల్ల అతడు ఈ పర్యటనకు దూరం కానున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.