ETV Bharat / sports

విజయానికి 86 పరుగుల దూరంలో కివీస్​

భారత్​తో రెండో టెస్టులో విజయం దిశగా పయనిస్తోంది న్యూజిలాండ్​. 132 పరుగుల లక్ష్యఛేదనలో రెండో ఇన్నింగ్స్​ ఆరంభించిన కివీస్​ లంచ్​ సమయానికి వికెట్​ కోల్పోకుండా 46 పరుగులు చేసింది.

New Zealand 46 for no loss at lunch after India's 124 all out
విజయానికి 86 పరుగుల దూరంలో కివీస్​
author img

By

Published : Mar 2, 2020, 6:24 AM IST

Updated : Mar 3, 2020, 3:00 AM IST

భారత బ్యాట్స్​మెన్​ విఫలమైన వేళ.. రెండో టెస్టులో విజయం దిశగా సాగుతోంది న్యూజిలాండ్​. మరో 86 పరుగులు చేస్తే మ్యాచ్ గెలిచి సిరీస్​ కైవసం చేసుకోనుంది​. 132 పరుగుల లక్ష్యఛేదనలో లంచ్​ సమయానికి వికెట్​ కోల్పోకుండా 46 పరుగులు చేసింది విలియమ్సన్​ సేన. బ్లండెల్​(23), లాథమ్​(16) పరుగులతో క్రీజులో ఉన్నారు.

అంతకుముందు రెండో ఇన్నింగ్స్​లో భారత్​ 124 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్​ ఆధిక్యం కలుపుకొని న్యూజిలాండ్​ ముందు 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. పుజారా(24) టాప్​ స్కోరర్​. ఇన్నింగ్స్​లో రెండో అత్యధిక స్కోరు ఎక్స్​ట్రా(21)లదే కావడం గమనార్హం. జడేజా(16), కోహ్లీ(14), పృథ్వీ షా(14) మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.

కివీస్​ బౌలర్లలో బౌల్ట్​ 4, సౌథీ 3 వికెట్లతో చెలరేగారు.

Last Updated : Mar 3, 2020, 3:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.