ETV Bharat / sports

'మీర్జాపూర్ 3‌' టైటిల్​ మారుతోందా?

'మీర్జాపూర్ 3​' వెబ్​సిరీస్​ టైటిల్​ మార్చే యోచనలో ఈ సిరీస్​ దర్శకనిర్మాతలు ఉన్నారని తెలిసింది. హింస, అసభ్య పదజాలం ఉపయోగించి మీర్జాపూర్‌ పేరును చెడగొడుతున్నారని ఆరోపణలు రావడమే ఇందుకు కారణం.

author img

By

Published : Jan 30, 2021, 7:07 PM IST

Updated : Jan 30, 2021, 7:42 PM IST

mirzapur
మీర్జాపూర్​

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలై సంచలనం సృష్టించింది 'మీర్జాపూర్‌' వెబ్‌ సిరీస్‌. క్రైమ్‌ థ్రిల్లర్‌ యాక్షన్‌గా వచ్చిన సీజన్‌ 1, సీజన్‌ 2 ఓటీటీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరో సీజన్‌తో అలరించేందుకు సిద్ధమవుతుందీ బృందం.

హింస, అసభ్య పదజాలం ఉపయోగించి మీర్జాపూర్‌ పేరును చెడగొడుతున్నారని ఇప్పటికే ఆరోపణలు వస్తోన్నాయి. ఈ కారణంగానే సీజన్‌ 3పై అదే ప్రభావం ఉండొచ్చనే అభిప్రాయంతో దర్శకనిర్మాతలు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. అందుకే ఈసారి కథలో కాస్త మోతాదు తగ్గించనున్నారట. కోపోద్రేకంగా ఉండే పాత్రల్లో మార్పులు, తుపాకీతో పేల్చే సన్నివేశాలు తగ్గించేలా సన్నాహాలు జరుగుతున్నాయి. 'మొదటి సీజన్‌ విడుదల సమయంలో ప్రజలు నుంచి ఎలాంటి ఆరోపణలు రాలేదు. ప్రస్తుతం నిరసనలు వస్తుండం వల్ల మార్పులు ఉండొచ్చు. సీజన్‌ 3ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే టైటిల్‌ను మార్చే అవకాశాలూ లేకపోలేద'ని ఈ సిరీస్‌లో నటిస్తున్న ఓ నటుడు ఆంగ్ల మీడియాకు తెలిపారు.

మరి పేరు మార్పుతో ప్రేక్షకులకు ఈ సిరీస్‌ గతంలో మాదిరిగా చేరుతుందా లేదా? అన్నదే ప్రశ్న. అలీ ఫాజల్‌, పంకజ్‌ త్రిపాఠి, ఇషా తల్వార్‌ తదితరులు ప్రధాన పాత్రలుగా కరణ్‌ అన్షుమాన్‌, గుర్మిత్‌సింగ్‌, మిహిర్‌ దేశాయ్‌ తెరకెక్కించారు ఈ సినిమాను.

ఇదీ చూడండి: వివాదాలకు కేరాఫ్ అడ్రస్​గా ఓటీటీ!

Last Updated : Jan 30, 2021, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.