అండర్-19 ప్రపంచకప్లో అదరగొట్టిన భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్.. ఆ తర్వాత ఆడిన తొలి మ్యాచ్లోనే దుమ్ములేపాడు. అండర్-23 సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా పాండిచ్చేరితో జరుగుతున్న పోరులో కొద్దిలో ద్విశతకం మిస్ చేసుకున్నాడు. గతంలో లిస్ట్-ఏ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన పిన్న వయసు క్రికెటర్గా రికార్డు సృష్టించాడు యశస్వి.
వాంఖడే వేదికగా పాండిచ్చేరితో జరిగిన ఈ మ్యాచ్లో 185 పరుగులు చేశాడు జైస్వాల్. ఇందులో 19 ఫోర్లు, సిక్స్ ఉన్నాయి.
అండర్-19 ప్రపంచకప్లో 400 పరుగులు చేసిన యశస్వి.. 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ'గా నిలిచాడు. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నాడు జైస్వాల్. అతడిని వేలంలో రూ.2.4 కోట్ల భారీ ధర పెట్టి కొనుక్కుందీ ఫ్రాంచైజీ.