ఐపీఎల్ 2021 నిర్వహణ పనులు ప్రారంభమైపోయాయి. ఈ మెగాలీగ్లో పాల్గొనే ఎనిమిది ఫ్రాంచైజీలు .. తాము అంటిపెట్టుకున్న ఆటగాళ్లు, ట్రేడింగ్ విండో వివరాలను సమర్పించేందుకు గడువు తేదీని ప్రకటించింది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. జనవరి 21లోగా అంటిపెటుకున్న ఆటగాళ్లు, ఫిబ్రవరి 4వ తేదీలోగా ట్రేడింగ్ విండో వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని లీగ్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు.
కాగా, ఫిభ్రవరి మూడో వారంలో మినీ వేలంపాట జరగనుంది. అయితే ఈ ఆక్షన్లో సంబంధిత ఫ్రాంచైజీలు.. ఆటగాళ్లను కొనుగోలు చేసే విషయమై రూ.85 కోట్లు మించి ధర వెచ్చించరాదని సదరు ఫ్రాంచైజీలకు సూచించారు పటేల్.
ఇదీ చూడండి : 'ఆ సమయంలో కన్నీరు ఆపుకోలేకపోయా'