ETV Bharat / sports

ఐపీఎల్ 2020: ఆల్ క్లియర్.. ఇక ఆడుకోవడమే తరువాయి

యూఏఈ వేదికగా ఐపీఎల్​ నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఈ విషయాన్ని ఐపీఎల్​ ఛైర్మన్​ బ్రిజేశ్​ పటేల్​ తాజాగా వెల్లడించారు. దీంతో ఫ్రాంచైజీలు పయనమవ్వడానికి మార్గం సుగమమైందని ఆయన తెలిపారు.

BCCI gets government's approval to host IPL 2020 in UAE, confirms League Chairman Brijesh Patel
యూఏఈలో ఐపీఎల్​కు కేంద్రం గ్రీన్​సిగ్నల్​
author img

By

Published : Aug 10, 2020, 7:47 PM IST

సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్​ నిర్వహించడానికి సోమవారం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న కారణంగా లీగ్​ను విదేశాల్లో నిర్వహించుకోవడానికి అంగీకరించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఓ ప్రకటన చేశారు ఐపీఎల్​ ఛైర్మన్​ బ్రిజేశ్​ పటేల్​.

"అవును, కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు లిఖిత పూర్వక అనుమతి లభించింది. మరోసారి ప్రభుత్వం నుంచి మాట ద్వారా అనుమతి వస్తే ఎమిరైట్స్​ క్రికెట్​ బోర్డును సంప్రదిస్తాం. ప్రస్తుతం మా దగ్గర లిఖిత పూర్వక అనుమతులున్నాయి. అందువల్ల టోర్నీ ప్రణాళిక ప్రకారమే జరుగుతుందనే విషయాన్ని ఫ్రాంచైజీలకు స్పష్టం చేయవచ్చు."

- బ్రిజేశ్​ పటేల్​, ఐపీఎల్​ ఛైర్మన్​

ఐపీఎల్​ కోసం యూఏఈకి ఆగస్టు 20న బయలుదేరడానికి ఫ్రాంచైజీలు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశాయి. ప్రయాణానికి 24 గంటల ముందు ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయాలని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

చెన్నై సూపర్​కింగ్స్ యాజమాన్యం త్వరలోనే ఆటగాళ్లకు శిక్షణా శిబిరాన్ని ప్రారంభించి.. ఈనెల 22న యూఏఈకి పయనమవ్వాలని ప్రణాళికలు చేసుకుంది. ఈ టోర్నీని షార్జా, అబుదాబి​, దుబాయ్​ నగరాల్లో సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు నిర్వహించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.