ETV Bharat / sports

5 ఏళ్ల వివాహబంధానికి ఎలిస్​ పెర్రీ- మ్యాట్​ గుడ్​బై

ఆస్ట్రేలియా మహిళా జట్టు స్టార్​ ప్లేయర్​, ఆల్​రౌండర్​ ఎలిస్​ పెర్రీ.. తన వివాహబంధానికి ముగింపు పలకబోతున్నట్లు ప్రకటించింది. తన భర్త, రగ్బీ ప్లేయర్​ మ్యాట్​ టుమువాతో విడిపోతున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇద్దరూ కలిసి సామాజిక మాధ్యమాల్లో ప్రకటన చేశారు.

ellyse perry
ఎలిస్​ పెర్రీ
author img

By

Published : Jul 27, 2020, 8:20 AM IST

Updated : Jul 27, 2020, 9:04 AM IST

ఆసీస్​ స్టార్​ మహిళా క్రికెటర్​ ఎలిస్​ పెర్రీ, తన భర్త మ్యాట్​ టుమువా.. తమ ఐదేళ్ల వైవాహిక బంధానికి గుడ్​బై చెప్పేశారు. వీరిద్దరూ 2015 డిసెంబర్​లో పెళ్లి చేసుకున్నారు. పెర్రీ క్రికెటర్​గా రాణిస్తుండగా.. టుమువా మెల్​బోర్న్​ రెబల్స్​ జట్టు తరఫున ప్రొఫెషనల్​ రగ్బీ ప్లేయర్​గా ఉన్నాడు.

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై నోరు మెదపని ఈ జంట.. ఆదివారం అనూహ్యంగా సోషల్​మీడియా వేదికగా ప్రకటన చేశారు.

"ఇద్దరం ఒకరి భావాలను మరొకరు గౌరవించుకొని విడిపోదామని ఈ ఏడాది ఆరంభంలోనే నిశ్చయించుకున్నాం. విడిగా జీవించేందుకు ఇదే సరైన నిర్ణయమని అనిపిస్తోంది. ఇద్దరికీ వేర్వేరు జీవితాలు, లక్ష్యాలు ఉన్నాయి. అందుకే ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది చాలా కష్టమైన సమయం" అని చెప్పుకొచ్చారు.

మెల్​బోర్న్​ వేదికగా ఆస్ట్రేలియా క్రికెట్​ అవార్డులకు వెడ్డింగ్​ రింగ్​ లేకుండా పెర్రీ హాజరవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ వేడుకలో ఈ అమ్మడు మూడోసారి బెలిండా క్లార్క్​ అవార్డు అందుకుంది.

ఫిబ్రవరి-మార్చిలో జరిగిన మహిళల ట20 ప్రపంచకప్​లో చివరిగా కనువిందు చేసింది పెర్రీ. టోర్నీ ఆద్యంతం అద్భుతంగా ఆడినా.. గాయం కారణంగా ఫైనల్​కు దూరమైంది.

Last Updated : Jul 27, 2020, 9:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.