దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్‌రత్నకు టీమ్ఇండియా ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, మిథాలీ రాజ్‌ల పేర్లను బీసీసీఐ సిఫార్సు చేసింది. బుమ్రా, కేఎల్.రాహుల్, ధావన్ పేర్లు అర్జున అవార్డు కోసం ప్రతిపాదించింది.
అశ్విన్ తన కెరీర్లో 79 టెస్టులు, 111 వన్డేలు, 46 టీ20లు ఆడి వరుసగా 413, 150, 52 వికెట్లు తీశాడు. టీమ్ఇండియా మహిళా టెస్టు సారథి మిథాలీ రాజ్ తన 22 ఏళ్ల కెరీర్లో జట్టుకు ఎంతో సేవ చేసింది. 11 టెస్టులు, 215 వన్డేలు, 89 టీ20లు ఆడి వరుసగా 669, 7170, 2364 పరుగులు చేసింది. కెప్టెన్‌గా జట్టుకు ఎన్నో విజయాల్ని అందించింది.
ఖేల్‌రత్నకు ఛెత్రీ పేరు
భారతీయ స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రీ పేరును ఖేల్‌రత్నకు సిఫార్సు చేసింది భారతీయ ఫుట్‌బాల్ సమాఖ్య. అయితే ఇందుకు సంబంధించిన పత్రాలను ఇంకా సమర్పించలేదు.