ETV Bharat / sitara

రామోజీ ఫిల్మ్​సిటీలో చిత్రీకరణలు పునఃప్రారంభం

లాక్​డౌన్​తో స్తంభించిన చిత్ర పరిశ్రమలో రెండున్నర నెలల తర్వాత మళ్లీ పనులు మొదలయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం వల్ల టెలివిజన్ ధారావాహికల చిత్రీకరణ ప్రారంభించారు. ఈటీవీలో ప్రసారమయ్యే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ధారావాహిక షూటింగ్​ను రామోజీ ఫిల్మ్​సిటీలో పునఃప్రారంభించారు. సెట్​లో కొవిడ్-19 మార్గదర్శకాలు పాటిస్తూ ఆ సీరియల్‌ చిత్రీకరణను మొదలుపెట్టారు.

షూటింగ్
షూటింగ్
author img

By

Published : Jun 12, 2020, 5:11 PM IST

Updated : Jun 12, 2020, 6:59 PM IST

రామోజీ ఫిల్మ్​సిటీలో చిత్రీకరణలు పునఃప్రారంభం

లాక్​డౌన్​తో రెండున్నర నెలలుగా మూతపడిన సినీ, టెలివిజన్ పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులతో ఊరట లభించింది. సగం పూర్తయిన సినిమాలు, అర్ధాంతరంగా నిలిచిపోయిన టెలివిజన్ ధారావాహికలు చిత్రీకరణ చేసుకోవచ్చన్న అనుమతుల మేరకు ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్​సిటీలో చిత్రీకరణల సందడి మొదలైంది. ఈటీవీలో ప్రసారమయ్యే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ధారావాహిక చిత్రీకరణను పునఃప్రారంభించారు. పరిమిత సంఖ్యలో సిబ్బందితో ఎం-సిటీలోని ఓ ఇంట్లో చిత్రీకరణ చేశారు. కొవిడ్-19 మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగ్ చేయడం.. ఆ ధారావాహికలో నటిస్తోన్న నటీనటుల్లో ధైర్యాన్ని నింపింది. లాక్​డౌన్ అనంతరం తొలిసారిగా రామోజీ ఫిల్మ్​సిటీలో జరుగుతున్న చిత్రీకరణలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Shooting Resume at Ramoji Film City
సురక్షిత వాతావరణంలో షూటింగ్

సీరియల్ చిత్రీకరణలో పాటిస్తున్న జాగ్రత్తలు

  • చిత్రీకరణ జరిపే లొకేషన్ బయట, లోపల పూర్తిగా శానిటైజ్ చేశారు.
  • సెట్​లోకి వచ్చే సిబ్బంది, నటీనటులకు థర్మల్ స్క్రీనింగ్ చేశారు.
  • శరీర ఉష్ణోగ్రతల నమోదుతోపాటు శానిటైజర్, మాస్క్​లు పంపిణీ చేశారు.
  • సెట్లో డిస్ ఇన్ ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేశారు.
  • చిత్రీకరణకు ఉపయోగించే కెమెరాలు, ఇతరత్రా వస్తువులను శానిటైజ్ చేశారు.
  • నటీనటులకు మేకప్ విషయంలో వ్యక్తిగత సిబ్బంది పీపీఈ కిట్లు ధరించారు.
  • పలువురు నటీనటులు వ్యక్తిగత మేకప్​కు ప్రాధాన్యత ఇచ్చారు.
  • అల్పహారం, భోజన విరామ సమయంలో భౌతిక దూరం పాటించారు.
  • పలువురు నటీనటులు, సిబ్బంది వ‌్యక్తిగతంగా ఆహారంతోపాటు మంచినీళ్లు తెచ్చుకున్నారు.
  • చిత్రీకరణ సమయంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ నటించారు.
  • నటీనటులతోపాటు సెట్​లో ఉన్న సిబ్బంది మాస్క్ లు, హ్యాండ్ గ్లౌజ్​లు ధరించారు.
  • 20 నుంచి 30 మందితోనే రోజంతా చిత్రీకరణ కొనసాగించారు.
    Shooting Resume at Ramoji Film City
    డిన్​ ఇన్​ఫెక్షన్ టన్నెల్
    Shooting Resume at Ramoji Film City
    ఆర్టిస్టులకు శానిటైజర్లు, మాస్కుల పంపిణీ

Last Updated : Jun 12, 2020, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.