ఈసారి దసరాకు సందడి మాములుగా ఉండదు. ఈటీవీలో ప్రసారమయ్యే ప్రోగ్రాంలో దర్శకుడు రాఘవేంద్రరావు, 'పెళ్లి సందD' టీమ్, గంగవ్వ, సదా తదితరులు వచ్చి అలరించనున్నారు.
అక్టోబరు 15న ఉదయం 9 గంటలకు 'దసరా బుల్లోళ్లు' పేరుతో ఈ ప్రోగ్రాం ప్రసారం కానుంది. అందుకు సంబంధించిన ప్రోమో శనివారం రిలీజ్ కాగా, అది అలరిస్తూ ప్రోగ్రాంపై అంచనాల్ని పెంచుతోంది.
శేఖర్ మాస్టర్, సదా, రోజా.. రాములో రాములా పాటతో ఎంట్రీ ఇచ్చి అలరించారు. ఆ తర్వాత శేఖర్ మాస్టర్‌పై రోజా వేసిన పంచులు మెప్పించాయి. అనంతరం 'పెళ్లి సందD' చిత్రబృందం షోకు హాజరై తెగ సందడి చేసింది. రాఘవేంద్రరావు గెటప్‌లో జబర్దస్త్ కమెడీయన్ నవీన్ చేసిన స్కిట్ ఆకట్టుకుంది.
ఫిదా సినిమాలో పిల్లా మెల్లగా వచ్చిండే పాటకు సదా చేసిన షో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తి కలిగిస్తోంది. హైపర్ ఆది 'కార్తికదీపం' స్కిట్‌తో తెగ నవ్వించాడు. హాస్యనటులు అందరూ.. గంగవ్వతో కలిసి పంట పొలాల్లో సందడి చేశారు. పైరు కోస్తూ, పొలాల్లో పనిచేస్తూ కనిపించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: