'ఓ మై ఫ్రెండ్' చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ సినిమా అనుకున్నంతస్థాయిలో ఆడకపోవడం వల్ల కొన్నేళ్లపాటు ఇంటికే పరిమితమైన దర్శకుడు వేణు శ్రీరామ్. మూడో చిత్రం 'వకీల్‌సాబ్'తో తన లక్‌ను పరీక్షించుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు. పవన్‌కల్యాణ్ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే విడుదలైన 'వకీల్‌సాబ్' ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్ పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆ విశేషాలు మీకోసం..
అది నా అదృష్టం
"పవన్‌కల్యాణ్ నాకెంతో ఇష్టమైన హీరో. 'వకీల్‌సాబ్' వల్ల ఆయనతో కలిసి సినిమా చేసే అవకాశం దొరకడం నా అదృష్టం. చాలాకాలం తర్వాత ఆయన వెండితెర వేదికగా ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తున్నారు. పవన్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని 'వకీల్‌సాబ్' డైరెక్ట్ చేయడంలో ఒత్తిడికి లోనయ్యారా? అని అందరూ అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే, నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. కేవలం సంతోషం మాత్రమే ఉంది. ఎందుకంటే నచ్చిన హీరోను డైరెక్ట్ చేసే అవకాశం 'వకీల్‌సాబ్'తో లభించింది. ఆయనతో కలిసి పని చేసిన ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ నా లైఫ్‌లో స్పెషలే."
పవన్.. ఓకే అన్నారంతే..!
'పింక్' రీమేక్ గురించి మొదట పవన్‌కల్యాణ్‌ను కలిసి చెప్పాను. ఒకేసారి కాకుండా సుమారు మూడుసార్లు కలిసి ఆయనకు ఈ కథ వివరించాను. పవన్ ఎంతో ఒద్దికైన వ్యక్తి అని అందరికీ తెలిసిన విషయమే. 'వకీల్‌సాబ్' కథ చెప్పగానే ఆయన కేవలం ఓకే అని మాత్రమే సమాధానమిచ్చారు. దానిని మించి ఎలాంటి రియాక్షన్ లేదు.
మెయిన్ కాన్సెప్ట్‌లో నో ఛేంజ్..!
"పింక్' సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ మహిళా సాధికారికత. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధానపాత్రల్లో నటించారు. అదే కథను తమిళ ప్రేక్షకులకు చేరువయ్యేలా కొన్ని మార్పులు చేసి అజిత్‌తో తెరకెక్కించారు. మహిళా సాధికారికత అనే కాన్సెప్ట్‌ను ప్రధానంగా చేసుకుని మరింత ఎక్కువమంది ఆడియన్స్‌కు చేరువయ్యేలా పవన్ ఇమేజ్ దృష్టిలో ఉంచుకుని కొన్ని అంశాలను జోడించాం. అంతేకానీ, మహిళా సాధికారికత అనే కాన్సెప్ట్‌కు ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు".
ఏడేళ్లు ఇంట్లోనే ఉన్నా..!
"నా మొదటి చిత్రం 'ఓ మై ఫ్రెండ్'. సిద్దార్థ్ కథానాయకుడిగా శ్రుతిహాసన్, హన్సిక, నవదీప్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమా 'స్నేహం' అనే సున్నితమైన కథాంశంతో తెరకెక్కింది. అయితే, నా మొదటి చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. దానివల్ల నేను సుమారు ఆరేడేళ్ల పాటు ఇంట్లోనే కూర్చున్నాను. అలాంటి సమయంలో నానితో 'ఎంసీఏ' తెరకెక్కించా. ఇప్పుడు నా మూడో చిత్రం 'వకీల్‌సాబ్'తో మీ ముందుకు వస్తున్నాను. నా మొదటి రెండు సినిమాల వల్ల నేర్చుకున్న ఎన్నో విషయాలు 'వకీల్‌సాబ్' సమయంలో ఉపయోగపడ్డాయి".
ది బెస్ట్ ఫెయిల్యూర్ చూశా..!
"సినిమాపై నాకు ఉన్న మక్కువ కారణంగానే నేనింకా ఇండస్ట్రీలో రాణించగలుగుతున్నాను. 'ఓ మై ఫ్రెండ్' టు 'వకీల్‌సాబ్' అనేది ఒక్కరోజులో జరిగిన ప్రయాణం కాదు. నా మొదటి సినిమా నుంచి మూడో చిత్రానికి పదేళ్ల శ్రమ ఉంది. నా మొదటి చిత్రానికే లైఫ్‌లో ది బెస్ట్ ఫెయిల్యూర్ చూసేశాను. సుమారు ఏడేళ్లు ఖాళీగా ఉన్నాను".
ఆయన్ని చూడగానే చిరునవ్వు వచ్చేసేది.
"పవన్‌తో సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నిజం చెప్పాలంటే ఇది నా డ్రీమ్. నాకే కాదు ఏ దర్శకుడికైనా ఆయనతో సినిమా చేయాలనే ఆశ ఉంటుంది. ఎందుకంటే ఆయన అభిమానులకు దేవుడు. 'వకీల్‌సాబ్' షూట్ జరిగినన్ని రోజులు నేను ఎంతగానో ఆనందించాను. వ్యక్తిగతంగా పవన్ ఫ్రెండ్లీ పర్సన్. ఆయనతో సినిమా చేస్తున్నప్పుడు నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. అలాగే సెట్‌లోకి ఆయన రాగానే నాకు ఎంతో ఆనందంగా ఉండేది. చిరునవ్వు చిందించేవాడిని".
ట్రైలర్‌లోనే సినిమా చూపించా..!
"వకీల్‌సాబ్' ఓ కోర్టు రూమ్ డ్రామా. సినిమా పోస్టర్లు, టీజర్ విడుదలైనప్పుడూ చాలామంది నుంచి కొన్ని కామెంట్లు వచ్చాయి. అయితే, ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మాత్రం ఆడియన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ట్రైలర్‌లో సినిమా చూపించాం. ఆ సన్నివేశాలను కోర్టులోనే చిత్రీకరించాం".
'బద్రి'ని గుర్తు చేయడానికేనా..!
"పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన 'బద్రి'లో ప్రకాశ్‌రాజ్ పాత్ర పేరు 'నందా'. ఆ చిత్రాన్ని గుర్తు చేయడం కోసమే 'వకీల్‌సాబ్'లోనూ ప్రకాశ్‌రాజ్ పాత్ర పేరు నందాగానే ఉంచాం. ఇందులో ఎలాంటి డౌంట్ లేదు".
తమనే సర్‌ప్రైజ్ ఇస్తాడు..!
"వకీల్‌సాబ్' సెకండాఫ్‌లో ఓ బిగ్ సాంగ్ ఉందని తమన్ చెప్పారు. కాబట్టి ఆ సర్‌ప్రైజ్‌ను ఆయనే రివీల్ చేస్తారు. ఆ సర్‌ప్రైజ్‌ని సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేస్తాడా? లేదా?అనేది తమన్ ఇష్టం".
- పవన్‌కల్యాణ్ కమ్ బ్యాక్ చిత్రంగా 'వకీల్‌సాబ్'ను ప్రకటించిన సమయంలో ఎంతోమంది సోషల్‌మీడియా వేదికగా నన్ను ఆడుకున్నారు. ఇంకా ఎవరు డైరెక్టర్ దొరకలేదా? ఈ కథ తప్పా వేరే ఏ కథ దొరకలేదా? అని కామెంట్లు చేశారు.
- తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు నా దృష్టి అంతా ఏప్రిల్ 9పైనే ఉంది. అలాగే 'ఐకాన్' సినిమా ఉంటుంది.
- 'వకీల్‌సాబ్' షూట్ సమయంలో మొట్టమొదటిసారి పవన్‌ది ఓ స్టిల్ బయటకు లీక్ అయ్యింది. అది కాస్తా వైరల్‌గా మారింది. అదీకాక ఆ వాకింగ్ స్టిల్ నాకెంతో నచ్చింది. నా డిజైనర్స్‌తో మాట్లాడి దానిని టైటిల్‌లో వచ్చేలా చేశాను.
- మొదట మేము ఈ చిత్రానికి 'మగువా లోకానికి తెలుసా నీ విలువా' అనే టైటిల్ అనుకున్నాం. ఆ తర్వాత 'లాయర్‌సాబ్', 'వకీల్‌సాబ్' ఈ రెండింటిలో ఏదీ పెట్టాలి అనే డైలామాలో ఉన్నాం. చివరికీ 'వకీల్‌సాబ్' ఫిక్స్ చేశాం.
ఇదీ చూడండి: టాలీవుడ్లో 'వకీల్‌సాబ్' ట్రైలర్‌దే ఆ రికార్డు!