ETV Bharat / sitara

సూర్య-కార్తి కాంబోలో కొత్త చిత్రం షురూ - karthi viruman movie

తమ్ముడు(కార్తి) నటించనున్న 'విరుమన్'​ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు ప్రకటించారు స్టార్​ హీరో సూర్య(surya produced movies). ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 2022లో రిలీజ్​ అవుతుందని చెప్పారు. ఈ చిత్రం నేడు(సెప్టెంబరు 6) పూజాకార్యక్రమాలతో షూటింగ్​ ప్రారంభించుకుంది.

surya
సూర్య
author img

By

Published : Sep 6, 2021, 12:26 PM IST

Updated : Sep 6, 2021, 1:08 PM IST

తమిళ స్టార్స్​, రియల్​ లైఫ్​ బ్రదర్స్​ సూర్య, కార్తి కలిసి ఒకే సినిమా కోసం పనిచేయనున్నారు. అయితే కలిసి నటించడం కాదు.. ఒకరేమో నిర్మాతగా వ్యవహరించనుండగా.. మరొకరు తెరపై కనువిందు చేయనున్నారు.

ముత్తయ్య దర్శకత్వంలో 'విరుమన్​'(Karthi new movie) అనే ఫ్యామిలీ ఎంటర్​టైనర్ సినిమా​ చేయనున్నారు కార్తి. ఈ చిత్రాన్నే సూర్య నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే అధికారికంగా ప్రకటించారు. 2022లో థియేటర్లలో విడుదలవుతుందని చెప్పారు. కాగా, ఈ చిత్ర షూటింగ్​ నేడు(సెప్టెంబరు 6) పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మూవీతో ప్రముఖ దర్శకుడు శంకర్​ కుమార్తె అదితి శంకర్​ వెండితెర అరంగేట్రం చేయనున్నారు. ప్రకాశ్​రాజ్​, సూరి, రాజ్​ కిరణ్​ కీలక పాత్ర పోషించనున్నారు. యువన్​ శంకర్​ రాజా స్వరాలు సమకూర్చనున్నారు. 2015లో కార్తి-ముత్తయ్య కాంబోలో విడుదలైన 'కొంబన్'​ సినిమా సూపర్​హిట్​గా నిలిచింది.

Viruman
శంకర్ కూతురు
Viruman
విరుమన్

సూర్య(surya produced movies) ఈ చిత్రంతో పాటు 'రామె ఆన్​దాలుమ్​ రావనె ఆన్​దాలుమ్', 'ఉడన్​పిరప్పె', 'జై భీమ్'​, 'ఓ మై డాగ్​' సినిమాలను నిర్మిస్తున్నారు. 'రాకెట్రీ', 'జై భీమ్'​, 'ఎథార్​క్కుమ్​ థునిన్​ధావన్​'​ సహా మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. ​

Viruman
విరుమన్

ఇదీ చూడండి: 'నవరస' మేకింగ్ వీడియో చూసేయండి!

Last Updated : Sep 6, 2021, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.