బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్.. కృష్ణ జింకల వేట కేసులో నేడు జోధ్‌పూర్ కోర్టులో హాజరవ్వాల్సి ఉంది. షూటింగ్లో బిజీ ఉన్న కారణంగా హాజరుకావడం లేదంటూ సల్మాన్ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపాడు. ఫలితంగా కేసు డిసెంబర్ 19కి వాయిదా పడింది.
సల్మాన్ తరఫున న్యాయవాది కోర్టులో రెండు దరఖాస్తులు సమర్పించుకున్నాడు. నేడు (శుక్రవారం) విచారణకు మినహాయింపు కోరుతూ ఒకటి.. పూర్తిగా వ్యక్తిగత విచారణకు మినహాయింపు ఇవ్వడం మరొకటి. మొదటి దరఖాస్తును అంగీకరించిన కోర్టు.. రెండో దానిపై విచారణ డిసెంబర్ 19కి వాయిదా వేసింది.
గతేడాది మేలో సల్మాన్‌కు ఈ కేసులో బెయిల్ ముంజూరైంది. అప్పటి నుంచి కోర్టు మెట్లెక్కలేదు ఈ నటుడు. ఈ ఏడాది జులై 4న జరిగిన విచారణ సందర్భంగా, సెప్టెంబరు 27న కోర్టు ముందు హాజరు కావాలని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి చంద్ర కుమార్ సొరంగా తీర్పిచ్చారు. లేదంటే సల్మాన్‌కు బెయిల్ రద్దవుతుందని చెప్పారు.
1998లో 'హమ్ సాత్ సాత్ హైన్' సినిమా షూటింగ్ సందర్భంగా జోధ్‌పూర్‌లోని కంకణి గ్రామంలో.. సల్మాన్, సైఫ్ అలీ ఖాన్, సొనాలీ బింద్రే, టబు, నీలమ్.. కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వారిపై కేసు నమోదైంది.
ఇవీ చూడండి.. ఈ తెలుగు ప్రేమకథకు ఓ ప్రత్యేకత ఉంది తెలుసా?