రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న 'ఆర్‌ఆర్‌ఆర్' తొలి భాగం చిత్రీకరణ పూర్తి చేసుకొని... రెండో షెడ్యూల్‌కు బల్గేరియా వెళ్లింది. అయితే మంగళవారం షూటింగ్ ప్రారంభమైంది. చిత్రీకరణ సమయంలో జక్కన్న ఓ కర్రను పట్టుకొని, కర్చీలో ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. అప్పుడు తీసిన ఫొటోను ఎన్టీఆర్ ఇన్‌స్టాలో పంచుకున్నాడు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
1920 నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఉంటుంది. ఇందులో విప్లవవీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ గురించి చెప్పనున్నారు.
"ఈ వీరుల జీవితాల్లో నిజంగా ఏం జరిగిందో మనకు తెలీదు. వారి జీవితాల్లో ఏం జరిగి ఉంటుందో, వారు అప్పుడు కలిసుండి ఉంటే ఎలా ఉండేదో ఊహించి.. ఈ కల్పిత కథ ద్వారా ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నాం".
-రాజమౌళి, దర్శకుడు
కొమరం భీమ్‌గా నటిస్తున్న ఎన్టీఆర్‌పై ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దాదాపు నెలరోజులు షూటింగ్ జరగనుంది. ఇందులో అల్లూరిగా చరణ్ నటించనున్నాడు. అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
'ఆర్‌ఆర్‌ఆర్' ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 10 భారతీయ భాషల్లో విడుదల చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో... దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
ఇదీ చూడండి: 'గ్యాంగ్ లీడర్' కోసం 7అడుగులు వెనక్కి వేసిన 'వాల్మీకీ'