అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా(వియాన్ ఇండస్ట్రీస్ అధినేత) గురించి విస్తుపోయే నిజాలను బయటపెట్టారు ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. అతడితో పాటు అతని చెల్లి భర్త ప్రదీప్ భక్షి(కెన్రిన్ కంపెని ఛైర్మన్)ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు తమ కంపెనీల ద్వారా 'హాట్‌షాట్స్ డిజిటల్ ఎంటర్టైనర్' పేరుతో ఓ యాప్ రూపొందించినట్లు తెలిపారు. ఇందులో పోర్న్ కంటెంట్ ఉంటుందని వెల్లడించారు.
"కుంద్రా అశ్లీల చిత్రాలు నిర్మిస్తున్నాడని ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదైంది. అప్పటి నుంచి దర్యాప్తు ప్రారంభించాం. ప్రస్తుతం విచారణలో భాగంగా కుంద్రా నుంచి ఎన్నో హాట్‌షాట్ ఫిల్మ్స్, వీడియో క్లిప్స్, వాట్సప్ చాట్స్ స్వాధీనం చేసుకున్నాం. సినిమాల్లో అవకాశం కోసం ముంబయికి వచ్చిన నటీమణులను ఆడిషన్స్ పేరుతో పిలిచి వారిని ఎంపిక చేసుకుంటారు. అనంతరం వారితో సెమీ న్యూడ్, న్యూడ్ సన్నీవేశాలంటూ ఆడిషన్స్ చేస్తారు. కొంతమంది దీన్ని వ్యతిరేకించి పోలీసులను ఆశ్రయించారు. మొదట్లో వారు ఈ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు రోజుకు రూ.3-4లక్షలు సంపాదించేవారు. ఆ తర్వాత క్రమంగా లాక్డౌన్లో వారి వ్యాపారం వృద్ధి చెందింది. లాక్డౌన్లో రోజుకు 7-8 లక్షలు ఆర్జించేవారు."
-మిలింద్, ముంబయి జాయింట్ పోలీస్ కమీష్నర్.
అశ్లీల చిత్రాల కేసులో భాగంగా బుల్లితెర నటీమణులైన గెహానా వశిష్ఠ్(32), యాస్మిన్ ఆర్.ఖాన్(40), మోనూ జోషి(28), ప్రతిభా నలవాడే(33). ఎమ్.అతీఫ్ అహ్మద్(24), దీపాంకర్ పి. కస్నవీస్(38), భానూసూర్య ఠాకూర్(26), తన్వీర్ హష్మీ(4), ఉమేశ్ కామత్(39)లను గతంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే అశ్లీల చిత్రాల కేసులో ఇప్పుడు బయట పడిన నిజాలు కొన్నేనని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వినోద రంగంలో ఉంటూ ఇలాంటి ముసుగు పనులు చేస్తున్న వారు చిత్రసీమలో చాలా మంది ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. భారత్‌లోని అనేక రహస్య ప్రాంతాలతో పాటు విదేశాలలో సెక్స్-రేవ్ పార్టీలు నిర్వహించి అశ్లీల చిత్రాలను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. అలా నిర్మించిన నీలి చిత్రాలను ప్రపంచంలోనే అనేక డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లకు లక్షల రూపాయలకు విక్రయిస్తున్నాని సమాచారం.
ఇదీ చూడండి: అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త అరెస్ట్