ETV Bharat / sitara

నటి పూనమ్ పాండే​ భర్తకు బెయిల్​ - latest poonam pandey news updates

లైంగిక వేధింపుల ఆరోపణలు కేసులో నటి పూనమ్​ పాండే భర్తకు గోవా కోర్టు బెయిల్​ మంజూరు చేసింది. తనను లైంగికంగా వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఈమె పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్లే అతడిని అరెస్టు చేశారు.

Poonam Pandey
పూనమ్​ పాండే
author img

By

Published : Sep 23, 2020, 3:06 PM IST

బాలీవుడ్​ బ్యూటీ పూనమ్​ పాండే భర్త, నిర్మాత సామ్​ బాంబేకు గోవా కోర్టు షరతులతో బెయిల్​ మంజూరు చేసింది. తనను లైంగికంగా వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నాడని పూనమ్​.. తన భర్తపై పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. గోవాలోని కనకొనా విలేజ్ షూటింగ్​కు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

బుధవారం నుంచి నాలుగురోజుల పాటు పోలీసు స్టేషన్​లో రిపోర్టు చేయాలని న్యాయస్థానం సామ్​ను ఆదేశించింది. గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న వీరిద్దరూ.. 13 రోజుల క్రితమే వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తన భర్త లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని పూనమ్​ ఆవేదన వ్యక్తం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.