ETV Bharat / sitara

'భీమ్లా నాయక్'​ ట్రీట్​.. 'కార్తికేయ 2' హీరోయిన్ ఖరారు - gopichand seetimaarr trailer release

కొత్త సినిమా కబుర్లు మిమ్మల్ని పలకరించేందుకు వచ్చేశాయి. ఇందులో పవన్​ కల్యాణ్​, గోపీచంద్​, నిఖిల్​, విజయ్​ సేతుపతి, నాగశౌర్య చిత్రాల వివరాలు ఉన్నాయి.

updates
అప్డేట్స్​
author img

By

Published : Aug 30, 2021, 9:19 PM IST

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ పుట్టినరోజు(సెప్టెంబరు 2)న అభిమానులకు ట్రీట్​ ఇచ్చేందుకు సిద్ధమైంది 'భీమ్లా నాయక్'​ చిత్రబృందం. గురువారం ఉదయం 11:16 గంటలకు టైటిల్​ సాంగ్​ను రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించింది.

మల్టీస్టారర్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భీమ్లా నాయక్​(Bheemla Nayak) పాత్రలో పవన్​.. డానియల్​ శేఖర్​గా రానా నటిస్తున్నారు. ఇటీవలే పవన్​ పాత్రకు సంబంధించిన గ్లింప్స్​ను చిత్రబృందం విడుదల చేయగా.. అభిమానుల నుంచి విశేషాదరణ లభించింది. ఈ మూవీకి సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్​ఎస్​ తమన్​ స్వరాలను సమకూరుస్తున్నారు.

updates
భీమ్లానాయక్​

ట్రైలర్​ రిలీజ్​

గోపీచంద్​ కథనాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'సీటీమార్​'(seetimaarr release date). కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కథానాయికగా తమన్నా నటిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్​ను సెప్టెంబరు 1న మధ్యాహ్నం 2:53గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. వినాయక చవితి పురస్కరించుకుని సెప్టెంబరు 10న థియేటర్లలలో విడుదల కానుందీ మూవీ.

updates
సీటీమార్​

హీరోయిన్​గా అనుపమ

నిఖిల్​ హీరోగా తెరకెక్కుతున్న 'కార్తికేయ 2' సినిమాలో హీరోయిన్​గా​ అనుపమా పరమేశ్వరన్​ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ స్పెషల్​ వీడియోను రిలీజ్​ చేశారు.

గతంలో 'కార్తికేయ' సినిమాకు మంచి ఆదరణ వచ్చింది. దానికి సీక్వెల్‌గా 'కార్తికేయ 2'ను తెరకెక్కిస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగర్వాల్‌ నిర్మాతలు. కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.

మహేశ్​ ప్రశంసలు

సుధీర్​బాబు హీరోగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్​ సినిమా ఇటీవల విడుదలై విజయంవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా చూసిన సూపర్​స్టార్​ మహేశ్​బాబు చిత్రబృందాన్ని ప్రశంసించారు. తాజాగా ఈ చిత్రం నిర్వహించిన సక్సెస్​​ మీట్​లో మహేశ్​ బాబు, నమ్రతా శిరోద్కర్​ పాల్గొని చిత్రబృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు.

updates
మహేశ్​బాబు
updates
నమ్రతాశిరోద్కర్​

షూటింగ్​ పూర్తి

నాగశౌర్య హీరోగా నటిస్తున్న 'లక్ష్య' షూటింగ్​ పూర్తైంది. విలువిద్య(ఆర్చరీ) కథతో తెలుగులో తీస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. కేతికా శర్మ హీరోయిన్. ఇందులో శౌర్య సిక్స్​ప్యాక్​తో కనిపించనున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

updates
లక్ష్య

నవ్విస్తోందిగా

విజయ్​సేతుపతి, తాప్సీ నటించిన హారర్​ కామెడీ చిత్రం 'అనబెల్​ సేతుపతి' ట్రైలర్​ విడుదలై ఆద్యంతం నవ్విస్తోంది. సెప్టెంబరు 17 నుంచి డిస్నీప్లస్​ హాట్​స్టార్​లో స్ట్రీమింగ్​ కానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: అవమానాలు భరించి.. కష్టాల కడలి దాటి.. సరికొత్త జీవితం దిశగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.