కల్యాణ మండపం ఆస్తి పన్నుపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించి భంగపడిన ప్రముఖ నటుడు రజినీకాంత్... బకాయి మొత్తాన్ని చెల్లించారని చెన్నై మహా నగర పాలక సంస్థ వెల్లడించింది. పన్నుతో పాటు జరిమానాను కూడా కట్టారని తెలిపింది.
అసలేం జరిగింది?
చెన్నై కొడంబాక్కంలోని శ్రీ రాఘవేంద్ర కల్యాణ మండపం రజినీకాంత్ పేరిట ఉంది. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత ఈ మండపాన్ని మూసేశారు. ఈ ఏడాది మార్చి 24 నుంచి అందులో వేడుకలు జరగలేదు. అయితే కల్యాణ మండపానికి రూ.6.50 లక్షల పన్ను చెల్లించాలంటూ చెన్నై కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
మద్రాసు హైకోర్టు ఆగ్రహం..
పన్ను వేయడాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో సూపర్‌స్టార్ రజనీకాంత్ పిటిషన్ వేశారు. ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. మహా నగర పాలక సంస్థకు అప్పీలు చేసుకోకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించి కోర్టు విలవైన సమయాన్ని వృథా చేయడం తగదని వ్యాఖ్యానించింది.
పశ్చాత్తాప స్వరం..
హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజున రజినీ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాఘవేంద్ర కల్యాణ మండపం ఆస్తి పన్నుపై మేము కార్పొరేషన్‌ను ఆశ్రయించాల్సింది. పొరపాట్లను నివారించవచ్చు. అనుభవం ఒక పాఠం.
- రజినీకాంత్, అగ్ర కథానాయకుడు
ఇదీ చూడండి: రజనీకాంత్‌పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం