ETV Bharat / sitara

ఈ హీరో తర్వాతి టార్గెట్​ పాన్​ఇండియా మూవీ!

author img

By

Published : May 11, 2021, 8:11 AM IST

Updated : May 11, 2021, 8:35 AM IST

సూపర్​స్టార్​ కృష్ణ అల్లుడిగా వెండితెరకు పరిచయమై.. నటనలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్​బాబు. తొలి చిత్రం 'శివ మనసులో శ్రుతి' నుంచి గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన 'వి' వరకు తనదైన నటనతో సినీ అభిమానులకు చేరువయ్యారు. నేడు (మే 11) సుధీర్​బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ.

hero sudheer babu birthday special
ఈ హీరో తర్వాతి టార్గెట్​ పాన్​ఇండియా మూవీ!

పాత్ర నిడివికి కాకుండా కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే తక్కువ మంది కథానాయకుల్లో సుధీర్‌బాబు ఒకరు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే 'వి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లాక్‌డౌన్ వల్ల ఓటీటీలో విడుదలైన సరే మంచి టాక్‌ అందుకుంది. ప్రస్తుతం 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ​దీని తర్వాత సుధీర్‌ బాబు ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ కోసం సిద్ధమవుతున్నారు.

hero sudheer babu birthday special
'శ్రీదేవి సోడా సెంటర్​' పోస్టర్​

తెలుగుతోపాటు హిందీలోనూ ఈ బయోపిక్​ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం సుధీర్‌బాబు మరింత ఫిట్‌గా తయారవుతూ.. బ్యాడ్మింటన్‌లో మరిన్ని మెలకువలు తెలుసుకుంటున్నారు. సుధీర్‌బాబు కూడా ఓ ప్రొఫెషనల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కావడం విశేషం. నేడు (మే 11) ఆయన పుట్టినరోజు సందర్భంగా గోపీచంద్​ బయోపిక్​పై విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

  1. నాకు బ్యాడ్మింటన్‌ ఆట తెలుసు. ఇప్పటికే ఇందులో కాస్త నైపుణ్యం ఉంది కాబట్టి భారీ స్థాయిలో శిక్షణ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాత టాలెంట్‌కు కాస్త మెరుగులు దిద్దితే సరిపోతుంది.
  2. నిజానికి కొన్ని బయోపిక్‌లు ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. ఎందుకంటే ఆ పాత్రలు పోషించిన నటులు కేవలం బాడీ లాంగ్వేజ్‌పై మాత్రమే దృష్టిపెట్టారు. ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడతారు తదితర విషయాలను గమనించి.. పాత్ర సోల్‌ను మిస్‌ చేశారు. ఒకవేళ మనకు ఆ వ్యక్తి సోల్‌ తెలియాలంటే.. అతడిని కలిసి ఉండాలి, అతనితో ప్రయాణం చేయాలి. అతడి జీవితంలోని మలుపులు స్వయంగా తెలుసుకోవాలి.
    hero sudheer babu birthday special
    సుధీర్​ బాబు
  3. నేను గోపీచంద్‌తో కలిసి ఎనిమిదేళ్లు ప్రయాణం చేశా. అతడికి పార్ట్‌నర్‌గా బ్యాడ్మింటన్‌ ఆడా. వీటి ద్వారా కొంత తెలుసుకున్నప్పటికీ.. తెలియాల్సింది చాలా ఉంది. ఆయన జీవితంలోని వ్యక్తుల్ని కూడా కలిసి, వారితోనూ మాట్లాడాలి. ఏ సందర్భంలో ఎలా స్పందిస్తారో తెలిస్తే పాత్రను తెరపై చక్కగా చూపించొచ్చు.
  4. బ్యాడ్మింటన్‌ టీవీలో చూస్తున్నప్పుడు చాలా సులభంగా కనిపిస్తుంది. కానీ నిజంగా ఆడటం కష్టం. ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆటగాడు తనతో తనే పోటీ పెట్టుకుంటాడు. ఆ సంఘర్షణను మనం మాటల్లో చెప్పలేం.. కేవలం భావాల ద్వారా మాత్రమే చూపించగలం.
    hero sudheer babu birthday special
    సుధీర్​ బాబు
  5. ఎంతో స్ఫూర్తినిచ్చే గోపీచంద్‌ జీవిత కథ దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలియాలి. ఈ సినిమా చూసిన తర్వాత కొందరైనా క్రీడాకారులుగా మారితే నా లక్ష్యం నెరవేరినట్లే.

ఇదీ చూడండి: డైరెక్టర్​ కావాలని యాక్టర్​ అయ్యాడీ హీరో!

Last Updated : May 11, 2021, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.